అదేమంటే.. మన స్టార్స్ అందరూ హీరోయిన్ల కొరత ఉందంటుంటారు. సినిమా షూటింగ్ మొదలై షెడ్యూల్స్ గడుస్తున్నా ఇంకా హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. ఉత్తరాదిలోని పంజాబ్, డిల్లీ, ముంబైల వైపు చూస్తుంటారు. ఇక మన స్టార్స్ వీక్‌నెస్ కనిపెట్టే ఉత్తరాది ముద్దుగుమ్మలు తమ రెమ్యూనరేషన్‌ను రెండు మూడింతలు పెంచేస్తుంటారు.
ఇక ఒకప్పుడు మన స్టార్స్ కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేసే వారు. కానీ ఇప్పుడు రెండు మూడు వుడ్‌లపై దృష్టి పెడుతుండటంతో ఈ డిమాండ్ మరింతగా పెరిగింది. ఇక సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ విషయానికి వస్తే ఆయన హీరోయిన్ల విషయంలో ఎవ్వరినీ ఇబ్బందిపెట్టడు. నిర్మాతలు, దర్శకులు ఒప్పిస్తే ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా, దీపికాపడుకొనే వంటి వారితోనైనా చేస్తాడు. లేదు అనుకుంటే అనుష్క, రాధికాఆప్టే, హిమూన్‌ఖురేషి వంటి వారికి కూడా నో చెప్పడు.
దర్శక నిర్మాత అబీష్టమే తన నిర్ణయమని, హీరోయిన్ల కోసం కోట్లు ఖర్చుపెట్టడం, నిర్మాతల చేత పెట్టించడం తనకు నచ్చదంటాడు. ఎంతో భారీగా రూపొందుతున్న '2.0'లో కూడా పెద్ద హీరొయిన్ కోసం ప్రయత్నించలేదు. అమీజాక్సన్‌తో లాగిస్తున్నాడు. తనలాంటి ఇమేజ్ ఉన్న స్టార్, కథలో దమ్ముంటే హీరోయిన్ల ఇమేజ్‌పై ఆధారపడనక్కరలేదనేది ఆయన అభిప్రాయం. ఇక 'బాహుబలి'లో కూడా రాజమౌళి, ప్రభాస్‌ని అనుష్కతో లాగించేశారు.
కానీ నేటి 'సాహో' నుంచి తాజాగా అక్కినేని అఖిల్- విక్రమ్ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖిల్ రెండో చిత్రంలో కూడా హీరోయిన్ ఫైనల్ కాకపోయేసరికి కాస్త షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చారని తెలుస్తోంది. ఇది అంత క్షేమదాయకం కాదు.