మెగాస్టార్ చిరంజీవి దాదాపు రజినీకి సమకాలీనుడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చివరకు కాంగ్రెస్ కాళ్ల వద్ద పెట్టి, రాజ్యసభకు ఎంపీగా, కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. అదే సమయంలో రజినీ రాజకీయాలలోకి వస్తానని చెబుతున్నాడే కానీ ఇప్పటివరకు రాలేదు. అదే సమయంలో డీఎండీకే పార్టీని స్థాపించిన కెప్టెన్ విజయ్‌కాంత్ మాత్రం ఇంకా తన పార్టీని కాపాడుకుంటూనే ఉన్నాడు. ఇక విషయానికి వస్తే చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'జనసేన' పార్టీని స్థాపించి, ప్రస్తుతం సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాడు.
ఇదే సమయంలో రజినీ రాజకీయ ఎంట్రీ మరలా ఊపందుకుంది. పవన్ ప్రస్తుతం తన ముందు ఉత్తరాది, దక్షిణాది వివక్షతో పాటు, ఏపీకి ప్రత్యేకహోదా వంటి వాటిపై సమరశంఖం పూర్తిస్తున్నాడు. వాస్తవానికి రజినీకి, పవన్‌కి చాలా విషయాలలో పోలికలున్నాయి. ఇద్దరి అలవాట్లు, ఫ్యాన్ ఫాలోయింగ్ నుంచి ఆధ్యాత్మిక వరకు ఇద్దరికీ సారూపత్యలున్నాయి. మరి రేపు రజినీ పార్టీ పెడితే, పవన్ జనసేనతో పాటు తమిళనాడులో రజినీ పార్టీ కూడా రాబోయే కాలంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటే మాత్రం అది ఖచ్చితంగా ఈ రెండు మూడు రాష్ట్రాలలోని ఇతర పార్టీలు, జాతీయ పార్టీలకు మాత్రం తలనొప్పిగా పరిణమిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.