Advertisementt

మహేష్ బాబు ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది..!

Mon 22nd May 2017 06:01 PM
mahesh babu,sachin tendulkar,sachin a billion dreams movie,mahesh twite on sachin  మహేష్ బాబు ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది..!
Mahesh babu Tweets On Sachin Tendulkar Biopic మహేష్ బాబు ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ గురించి ఒక న్యూస్ భలే కామెడీగా సర్కులేట్ అవుతుంది. ఆ న్యూస్ చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. అదేమిటంటే మహేష్ ఒక చిత్రాన్ని ప్రచారం చెయ్యడానికి భారీ మొత్తంలో ఫీజ్ వసూలు చేశాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయో పిక్ ని 'సచిన్.. ఎబిలియన్ డ్రీమ్స్' పేరుతొ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సచిన్ బయోపిక్ లో సచిన్ హీరో. అయితే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. 'రకరకాల పేర్లతో వెలుగొందుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నటించిన సచిన్.. ఎబిలియన్ డ్రీమ్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాని.... అల్ ద బెస్ట్ సచిన్' అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

అయితే మహేష్ కు సచిన్ మీద ఉండే అభిమానంతో అలాంటి ట్వీట్ చేశాడు. ఇక మహేష్ చేసిన ట్వీట్ కి సచిన్ కూడా రీ ట్వీట్ చెయ్యడంతో ఇప్పుడు ఆ ట్వీట్స్ మీద సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం చాలా కామెడీగా ఫన్నీగా వుంది. అదెలా అంటే మహేష్, సచిన్ సినిమా కి చేసిన ట్వీట్ కి గాను భారీ మొత్తంలో క్యాష్ అందుకున్నాడని... ప్రచారం జరుగుతుంది. మరి మహేష్ అలా సచిన్ సినిమా ప్రమోషన్ కోసం డబ్బు తీసుకున్నాడనే దానిలో ఏ మాత్రం నిజం లేకపోయినా... ఆ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఇకపోతే సచిన్ అంటే మహేష్ కొడుకు గౌతమ్ కి చాలా ఇష్టమని ఒక సందర్భంలో మహేష్ భార్య నమ్రత చెప్పింది. మరి అలాంటి సచిన్ సినిమా విడుదలవుతుంది అంటే ఇలా మహేష్ ట్వీట్ చెయ్యడం పెద్ద విషయం కాదు.   అలాగే క్రికెట్ లో సచిన్ కి ఎలాంటి పేరుందో అందరికి తెలుసు. అలాంటి వ్యక్తి జీవిత కథ సినిమాగా వస్తుంది అంటే ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఇక అలాంటి సినిమాకి మహేష్ ప్రత్యేకించి ప్రచారం కల్పించాల్సిన పని లేదు. ఆ విషయం గుర్తించని కొందరు ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేస్తుంటారు.

Mahesh babu Tweets On Sachin Tendulkar Biopic:

Now a newsletter about Mahesh in Social Media becomes a circulating comedy.  The news that Mahesh has earned a huge amount of fee to promote a film Sachi A Billion Dreams is now in the social media.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ