Advertisementt

మణిరత్నం చిత్రాలపై వార్తలే వార్తలు..!

Mon 22nd May 2017 05:21 PM
mani ratnam,ram charan,sukumar,chiranjeevi,yodha movie  మణిరత్నం చిత్రాలపై వార్తలే వార్తలు..!
Ram Charan and Maniratnam's 'Yodha' Soon? మణిరత్నం చిత్రాలపై వార్తలే వార్తలు..!
Advertisement
Ads by CJ

క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం చాలా కాలం కిందటే ఫామ్‌ కోల్పోయాడు. కానీ 'ఓకే కన్మణి'తో మరలా ట్రాక్‌లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ దానికి ముందు వచ్చిన 'కడలి', తాజాగా వచ్చిన 'చెలియా'లతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక ఆయన త్వరలో రజనీకాంత్‌, మమ్ముట్టి, రామ్‌ చరణ్‌లతో 'దళపతి'కి సీక్వెల్‌ చేయనున్నాడని, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఇక రజినీ రాజకీయాలలోకి వెళ్తున్నాడంటున్నారు. కానీ '2.0', రంజిత్‌పా, ఇప్పుడు మణిరత్నం చిత్రాలను చూస్తే రజినీపై అనుమానం వస్తోంది. ఇక తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. 'చెలియా' కంటే ముందే మణి రామ్‌ చరణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అసలు 'ఓకే బంగారం'లో దుల్కర్‌ సల్మాన్‌ పాత్రను చరణ్‌ చేయాల్సివుంది. కాగా ప్రస్తుతం మరలా ఇటీవలే మణి చరణ్‌కి, చిరుకి పూర్తి స్థాయి స్క్రిప్ట్‌తో ఓ కథను వినిపించాడని అందరికీ నచ్చడంతో ఓకే చేశారని అంటున్నారు. 

చరన్‌.. సుక్కుతో సినిమా పూర్తయిన తర్వాత ఆయన తదుపరి చేసేది మణి చిత్రంలోనే అనే వార్తలు వస్తున్నాయి. చరణ్‌ గతంలో కూడా ఫ్లాప్‌లలో ఉన్న కృష్ణవంశీ, శ్రీనువైట్ల వంటి వారికి చాన్స్‌ ఇచ్చాడు. ఆయన మణికి ఓకే అన్నాడని ఈ చిత్రం టైటిల్‌ 'యోధ' అనే ప్రచారం మొదలైంది. మరి దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి..! 

Ram Charan and Maniratnam's 'Yodha' Soon?:

Director recently met the Mega Power Star and narrated the script. Impressed with the story, Ram Charan has reportedly said 'Go ahead' with the director. The film's title has been confirmed as 'Yodha'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ