రామ్ చరణ్ సినిమాలంటే అనుకున్న సమయానికి ఏదీ విడుదల కాదనే విమర్శ ఉంది. 'బ్రూస్‌లీ' వంటి ఒకటి అరా చిత్రాలు తప్ప అన్నీ పోస్ట్‌పోన్ అయిన చిత్రాలే. ఇక సుకుమార్ మంచి దర్శకుడే కానీ ఆయనది ఇదే పంధా. ఎప్పుడు మొదలుపెడతాడో? ఎప్పుడు రిలీజ్ చేస్తాడో? తెలియదు. ఇక వీరిద్దరితో మొదలైన చిత్రం ఎంతో ఆలస్యంగా పట్టాలెక్కింది. చరణ్ కాస్త ఆలస్యంగా సెట్‌లోకి వచ్చాడు. గోదావరి జిల్లాలలో వేగంగా షూటింగ్ జరుగుతున్నట్లు కనిపించింది.
ఇంతలో వేడి దెబ్బకు సమంతకు వడదెబ్బ తగలడంతో షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ వచ్చేశారు. ఇక ఇంకా వేడి తగ్గకపోవడంతో కొన్నిరోజులు షూటింగ్‌ను వాయిదా వేశారని సమాచారం. మరోపక్క ఈ చిత్రంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కీలకమైన సమంత తండ్రి పాత్రను చేస్తున్నాడు. కానీ ఆయనను అర్ధాంతరంగా ఈ చిత్రం నుండి తప్పించి ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నారట. దీనికి మెగాకాంపౌండే కారణమంటున్నారు.
గతంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రాజ్‌కిరణ్‌ను తప్పించి ప్రకాష్‌రాజ్‌ను తీసుకోవడం, అది పలు విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇక 'గోవిండుడు' తరహాలోనే ఈ చిత్రంలో కూడా రావు రమేష్‌పై చిత్రీకరించిన సన్నివేశాలను మరో సారి ప్రకాష్‌రాజ్‌తో రీషూట్ చేయనున్నారని సమాచారం. దీంతో ఈ చిత్రం దసరా రేసులో ఉండేలా కనిపించడం లేదు.