Advertisementt

రాలేకపోయినందుకు సారీ చెప్పిన జనసేనాని...!

Sun 21st May 2017 08:17 PM
janasena party,pawan kalyan,cpm,madhu,loksatta jayaprakash narayan  రాలేకపోయినందుకు సారీ చెప్పిన జనసేనాని...!
Janasena President Pawan Kalyan Said to Sorry రాలేకపోయినందుకు సారీ చెప్పిన జనసేనాని...!
Advertisement
Ads by CJ

ఈ రోజు ఏయూలో ఉత్తరాంధ్ర వెనుకబాటు-ప్రజల ఆకాంక్ష పేరుతో భేటీ జరిగింది. దీనికి సీపీఎం నేత మధు, కొణతాల, లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ తదితరులు హాజరయ్యారు. పవన్‌కి కూడా ఆహ్వానం అందింది. కానీ విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని, జనసేన తరపున దుర్గాప్రసాద్‌ని పంపామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర వెనుకబాబుతనం, ప్రత్యేకహోదాలపై మరలా గళమెత్తాడు. 

వెనక్కి తగ్గేదిలేదని, మడమ తిప్పేది లేదని ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఉత్తరాంద్రను పోరాటాలకు పుట్టినిల్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రణాళికాబద్దమైన అభివృద్ది లోపం కారణంగానే ఇప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందన్నారు. తాము ఉత్తరాంద్ర అభివృద్ది కోసం పోరాడుతామని చెప్పారు. తొలి ప్రయత్నంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను లేవనెత్తామన్నారు. ఉత్తరాంద్ర, రాయలసీమ వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ది ప్రత్యేకహోదాతోనే సాద్యమవుతుందని పేర్కొన్నారు. 

దీనిపై జనసేన మడమ తిప్పని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం మధు మాట్లాడుతూ, ఉత్తరాంద్ర అభివృద్దిలో ప్రభుత్వ చర్యలు శూన్యమని, ఈ ప్రాంతాన్ని గాలికొదిలేశారని, శ్రీకాకుళం జిల్లా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మహానాడులో టిడిపి ఉత్తరాంద్ర విషయంలో శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ ఉద్దానం సమస్యలను ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం కాస్త కదిలిందని, కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక్క లీటర్‌ మినరల్‌ వాటర్‌ను కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Janasena President Pawan Kalyan Said to Sorry:

Today of the AU, the backwardness of the North has been meet with the desire of the people. CPI (M) leader Madhu, konathala, Loksatta Jayaprakash Narayan and others participated. Pawan has also been invited.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ