సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందువు. ఇక ఇద్దరు ఇష్టపడ్డారు. పెద్దలు ఒప్పుకున్నారు. ఇప్పటికే నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్‌లో ఈ జంట ఒకటవుతున్నారు. ఇక వీరి పెళ్లిని గోవాలో క్రిస్టియన్ మతానుసారం, ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సమంత తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని, స్వామి వారి సేవలో పాల్గొంది. దీంతో సమంత హిందూ మతం పుచ్చుకుందని, అందుకే ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నది వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో చైతు, సమంత పాల్గొని పూజలు జరిపారు. అప్పుడు కూడా సమంత హిందు మతం పుచ్చుకుందనే వాదనలు వచ్చాయి. తర్వాత వాటిని చైతూ, నాగ్‌లు ఖండించారు. ఇక త్వరలో హిందూ కుటుంబానికి కోడలు కానుండటంతో ఇప్పటి నుంచే సమంత హిందూ సంప్రదాయాలను నేర్చుకుంటున్నది అంటున్నారు. అయినా వారికి, వారి కుటుంబసభ్యులకు లేని అభ్యంతరం మిగిలిన వారికి ఎందుకో అర్దం కాని విషయం.