Advertisementt

కమల్‌ చెప్పిన రజనీ సంగతులు...!

Sun 21st May 2017 11:59 AM
kamal haasan,rajinikanth,tamil stars,auper star rajinikanth  కమల్‌ చెప్పిన రజనీ సంగతులు...!
Kamal Haasan Told About Rajinikath Things కమల్‌ చెప్పిన రజనీ సంగతులు...!
Advertisement
Ads by CJ

తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా రజనీకి మాస్‌స్టార్‌గా, కమల్‌కి లోకనాయకునిగా పేరుంది. కాగా వీరిద్దరు 80వ దశకంలో పలు చిత్రాలలో కలిసి నటించారు. కాగా ఆమద్య రజనీ తనతో మాట్లాడిన ఓ విషయాన్ని కమల్‌ చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరిపై బైక్‌ రైడింగ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తుండగా, బైక్‌ స్కిడ్‌ అయింది. 

వెంటనే రజనీ కమల్‌తో నీకు డ్రైవింగ్‌ వచ్చు కదా..! అని అడిగాడట. దానికి కమల్‌ నేను పడిపోయినా ఫర్వాలేదు.. మిమ్మల్ని పడిపోనివ్వను అని చెప్పడం.. దానికి ఎంతగానో కదిలిపోయిన రజనీ ఇటీవల ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేశాడని కమల్‌ చెప్పుకొచ్చారు. ఇక తామిద్దరం మరలా కలిసి నటించాలని భావిస్తున్నామని, దానికి నేను దర్శకత్వం వహిస్తానో, రజనీ దర్శకత్వం వహిస్తాడో లేక మూడో వ్యక్తి డైరెక్షన్‌ చేస్తాడో? అని కమల్‌ ఉద్విగ్నంగా చెప్పారు.

అయినా తమ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే తమను భయపెడుతున్నాయని కమల్‌, రజనీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వీరిద్దరూ మాత్రం తాము కలిసి మరలా నటించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తమ అభిమానులలో ఆనందం రేపుతున్నారు. 

Kamal Haasan Told About Rajinikath Things:

Not only in Tamil Nadu but also as a masquerque for Rajini throughout the country, Kamal is known as the Lokanayani. Kamal said that he had spoken to him in a conversation with the late things Rajinikanth.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ