'బాహుబలి'కి ముందే తమిళ శంకర్ పలు భారీ చిత్రాలు తీసినా కూడా 'బాహుబలి-ది బిగ్‌నింగ్', తాజాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లతో దేశంలోని అన్ని వుడ్‌లలో దక్షిణాది చిత్రాలపై మంచి గురి ఏర్పడింది. ప్రాంతీయ భాషలో తీసినా సరే.. సరైన కంటెంట్, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే 1000 కోట్ల నుంచి 2000కోట్లకు కూడా చేరడం సులభమేననే నమ్మకం కలిగించిన చిత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్'.
ఇక ప్రస్తుతం శంకర్, రజనీ, అక్షయ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో ఏకంగా 450కోట్లతో '2.0' రూపొందుతూ, షూటింగ్ ముగించుకుని వచ్చే ఏడాది 2018 జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఇంతలోపే ఓ దుబాయ్ స్నేహితుడైన ఎన్నారై నిర్మాతగా 1000కోట్ల భారీ బడ్జెట్‌తో 'రాండామూజం' అనే సుప్రసిద్ద నవల ఆధారంగా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ భీముని కోణంలో జరిగే మహాభారతాన్ని శ్రీకుమార్ దర్శకత్వంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
మరోవైపు మాస్టర్ బ్రెయిన్ అల్లు అరవింద్, 500కోట్లతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రామాయణంను తీస్తానని త్వరలో అంటే నవంబర్‌లో పట్టాలెక్కిస్తానన్నాడు. మధు మంతెన, నవీన్ మహోల్త్రాలు భాగస్వాములుగా వ్యవహరించనున్నారు. మధు మంతెన రాంగోపాల్ వర్మకు మేనల్లుడు. గతంలో అమీర్‌ఖాన్‌తో అల్లుఅరవింద్ తీసిన తొలి 100కోట్ల మూవీ 'గజిని'కి కూడా ఆయన ప్రొడక్షన్ వ్యవహారాలు చూశాడు. ఇక ఈ చిత్రం దర్శకుడు ఎవరు? అనే దానిపైఈ చిత్ర విజయాన్ని అంచనా వేయవచ్చంటున్నారు.
ఇక 500కోట్లతో తమిళంలో సి.సుందర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సంఘమిత్ర' కేన్స్‌ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభించారు. శృతిహాసన్, జయం రవి, ఆర్యలతో ఈ చిత్రం ఏమాత్రం నెగ్గుకొస్తుందో చూడాలి....! మరోపక్క ప్రస్తుతం మహేష్‌తో 'స్పైడర్' తీస్తున్న మురుగదాస్ తన నెక్ట్స్ చిత్రాన్ని విజయ్‌తో భారీగా తెరకెక్కించనున్నాడు. 'రోబో' తర్వాత సన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.