నిన్నటిదాకా తమిళనాడులో జయలలిత మరణం, కరుణానిధి ముసలితనం వల్ల, పన్నీరుసెల్వం, పళనీస్వామి, స్టాలిన్ వంటి వారికి సరైన దిక్సూచి లేని కారణంగా రాజకీయ శూన్యత ఏర్పడింది. కానీ తాజాగా తలైవా ఇక తనను దేవుడు ఆదేశించాడనే నమ్ముతున్నాడు. తాజాగా ఆయన తన స్థానికతపై వస్తున్న విమర్శలను తానే చెప్పుకొని వాటిని క్లారిటీ ఇచ్చేశాడు. తాను కర్ణాటకలో 23 ఏళ్లు బతికానని, కానీ 43ఏళ్లు తమిళవాసిగా పెరిగానని చెప్పాడు. తమిళులు తమ అభిమానంతో తనను తమిళవాడిగా, నూటికి 150శాతం తమిళునిగా మార్చేశారని, తాను జీవితాంతం తమిళనాడు వాసిగానే ఉంటానని ఉద్వేగంగా చెప్పాడు. నేను పక్కా తమిళుడిని... రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అంత: రాష్ట్ర సమస్యలు వచ్చిన ప్రతిసారి కన్నడిగునిగా తనపై ప్రచారం చేయడం.. తన మనోభావాలను దెబ్బతీయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీని ద్వారా ఆయన బిజెపి సుబ్రహ్మణ్యస్వామి, శరత్‌కుమార్ వంటి వారి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాడు. ఇంతకాలానికి మౌనం వీడి తాను తమిళుడిని కానందు వల్ల తనకు సీఎం అయ్యే అర్హత లేదని, తాను రాజకీయాలకు పనికి రానని అంటున్న మాటలకు సరైన సమాధానం ఇచ్చాడు. ఇక రజనీకి రాజ్‌బహదూర్ మాటే శిలాశాసనం, వీరిద్దరు బెంగుళూరులో ఒకే బస్సులో పనిచేసే వారు. ఆయన ఇచ్చిన డబ్బులతోనే రజనీ చెన్నై వచ్చి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. తనకొచ్చే జీతంలోనే రాజ్ బహదూర్ తన కుటుంబానికి ఎంత మొత్తం కేటాయించేవాడో రజనీకి కూడా అంతే మొత్తం పంపేవాడు. ఆయన లేనిదే ఈరోజు రజనీని సూపర్‌స్టార్‌గా చూడటం అయ్యేది కాదు.
ఇక రాజ్‌బహదూర్ మాట్లాడుతూ, రజనీ రాజకీయాలలోకి రావడం ఖాయం. ఏడు కోట్ల మంది తమిళుల కోరికను ఆయన నెరవేర్చనున్నాడు. ఆయన ఖచ్చితంగా సొంతపార్టీతోనే పాలిటిక్స్‌లోకి వస్తాడు. ఆయన మే8న ఓ వేడుక కోసం బెంగుళూరు వచ్చాడు. ఎప్పుడు లేనంత టెన్షన్‌గా ఉన్నాడు. అంత టెన్షన్‌గా రజనీ ఉండటం నేనింత వరకు చూడలేదు. జయలలిత తర్వాత తమిళ ప్రజలకు ఎవరు ఆదర్శంగా నిలుస్తారు? అని వాపోయాడు. ఆయన తన ప్రాణస్నేహితులందరినీ పిలిచి 12 గంటల పాటు తాను రాజకీయాలలోకి రావాలా? వద్దా? అని చర్చించిన విషయాన్ని రాజ్ బహదూర్ బయటపెట్టాడు...సో.. రజిని రాక ఖాయం.. ఎనీ డౌట్స్...!