Advertisementt

యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్ కి ఈ లుక్ చాలదా..!

Sat 20th May 2017 06:53 PM
young tiger ntr,jr ntr,jai lava kusa,jai lava kusa first look,jr ntr birthday special  యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్ కి ఈ లుక్ చాలదా..!
Jai Lava Kusa NTR First Look Talk యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్ కి ఈ లుక్ చాలదా..!
Advertisement
Ads by CJ

'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌' చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ 'జనతాగ్యారేజ్‌' తర్వాత ఎందరో దర్శకులు, ఎందరో నిర్మాతలు, ఎన్నో కథలు విని చివరకు కె ఎస్ రవీంద్ర ఉరఫ్‌ బాబి తో సినిమా చేస్తున్నాడు. అందులోనూ దీనిని తొలిసారిగా తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఓన్‌ బేనర్‌ అయిన 'ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌'లో చేస్తున్నాడు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా రూపొందనుందని సమాచారం.

ఇక ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని అందులో ఒకటి నెగటివ్‌ షేడ్స్‌లో ఉంటుందంటున్నారు. ఇప్పటికే శ్రీరామనమి సందర్భంగా ఈ చిత్రం మోషన్‌ టైటిల్‌ 'జై లవకుశ'ను విడుదల చేశారు. తాజాగా ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను చూపించారు.

ఇప్పటివరకు వచ్చిన ఎన్టీఆర్‌ చిత్రాల కంటే ఇందులో ఎన్టీఆర్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా, తీక్షణపు చూపులను కళ్లద్దాలలో దాచి చూస్తున్నాడు. ఇక మరో పోస్టర్‌లో ఆయన చేతులకు సంకెళ్లు వేసుకుని, ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించే పోస్టర్‌ మాత్రం కేకపుట్టిస్తోంది. ఈ పోస్టర్‌లోని ఎన్టీఆరే 'జై లవ కుశ'లో నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర చేస్తున్న ఎన్టీఆర్‌గా పలువురు భావిస్తున్నారు. విలనిజంలో కూడా హీరోయిజాన్ని, నాయకత్వ పవర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ లుక్‌ అదరగొడుతూ, అభిమానులను ఆనందింపజేస్తోంది. 

Jai Lava Kusa NTR First Look Talk:

Young Tiger Ntr's much awaited first look of his upcoming film 'Jai Lava Kusa' was released, on the eve of his birthday.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ