రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల కుమారుడు రాహుల్‌గాంధీకి దేశవ్యాప్తంగా పప్పు అనే పేరుంది. మోదీ హవాను చూసి భయపడుతున్నాడని, ఆయన్ను ఎదుర్కోలేక పార్టీ పగ్గాలు తనకు వద్దంటున్నాడని ఆయనపై అనేక రూమర్లు ఉన్నాయి. ఇక తనను భావి ప్రధానిగా ప్రమోట్ చేయవద్దని, అలాగే పెళ్లి కూడా చేసుకుంటానో లేదో తెలియదని అంటూ ఉంటాడని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలోనూ, ఇతర విషయాలలోనూ ఆయన అనుభవ రాహిత్యం బహిర్గతమవుతోంది. కానీ సంజయ్‌గాంధీ-మేనకాగాంధీల కుమారుడు వరుణ్ గాంధీ మాత్రం తనకు రాజకీయ పరిపక్వత ఉందని రుజువు చేస్తున్నాడు. ఆయన, ఆయన తల్లి ఇద్దరూ బిజెపిలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్‌గాంధీ ఓ పార్లమెంటేరియన్‌గా చక్కగా వ్యవహరిస్తూనే పరోక్షంగా ధైర్యంగా మోదీపై విమర్శనాస్త్రాలను సంధించాడు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, నేటి ప్రభుత్వాలు మాత్రం బడా పారిశ్రామిక వేత్తలకు, వారి సంస్థలకు కోట్ల రూపాయల రుణమాఫీలను ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
దేశ జనాభాలోని కేవలం ఒకే ఒక్క శాతం మంది ప్రజల చేతిలో దేశంలోని 50శాతానికి పైగా వనరులు ఉండిపోవడం ఏమిటని? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాబోయే ఎన్నికలు కులం-మతం-ప్రాంతాలకు అతీతంగా జల్-జమీన్-జంగిల్-మహిళా సాధికారతలే ముఖ్యాంశాలుగా నిలుస్తాయని, విదేశీపెట్టుబడులు భారత్‌ను మార్చలేవని, పేద ప్రజల సంక్షేమమే మహా భారత్ ఏర్పడటానికి ముఖ్యమని ఆయన పరోక్షంగా కేంద్రం తీరును కూడా ఎండగట్టి సెహభాష్ అనిపించుకున్నారు.