కీరవాణి.. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో లెజెండ్ వంటి వ్యక్తి. ఇక ఆయనకు వైరాగ్యం వచ్చేసిందేమో తెలియదు కానీ ఇక సంగీతం అందించను.. తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్యపై ఉంది.. వంటి స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాడు. ఇక తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్వీట్ చేస్తూ... అని భాషా చిత్రాలలోకి 'బాహుబలి' చిత్రం గొప్పది అనే విధంగా ట్వీట్ చేశాడు. దానికి కీరవాణి రీట్వీట్ చేస్తూ అదే నిజమైతే.. బాహుబలి మలయాళవెర్షన్‌కి ఓ బాలీవుడ్ గాయని/గాయకుడు పాటను పాడటాన్ని అవమానంగా భావించాడు... అంటూ కెలికాడు.
గతంలో కీరవాణితో ఏసుదాస్‌కు సంబంధాలు సరిగా లేకపోయిన 'బాహుబలి' మలయాళ వెర్షన్‌కు ఏసుదాస్ కుమారుడు పాట పాడాడు. నిజంగానే ఓ బాలీవుడ్ గాయని లేదా గాయకుడు ఎవరు మలయాళ వెర్షన్‌కి పాడటాన్ని అవమానంగా భావించారు.. అనేది బహిరంగంగా చెప్పడానికి ఆయనకు ఉన్న అభ్యంతరం లేదా భయం ఏమిటో అర్దంకావడం లేదు. లెజెండ్స్ వంటి వీరు కూడా ఏదైనా ఉంటే ఓపెన్ హార్ట్‌గా, బోల్డ్‌గా మాట్లాడాలే గానీ బాలీవుడ్ సింగర్స్ అందరినీ తెలుగు ప్రేక్షకులు అనుమానించేలా చేయడం సబబుకాదు.
ఒకరు చేసిన నేరానికి తెలుగు ప్రేక్షకులు రేపు తమ ఊహాజనితమైన విధంగా పలువురిని అనుమానించే అవకాశం ఉంది....!