Advertisementt

ఆ ఊపు చూస్తుంటే..ఎన్టీఆర్‌ కి అవార్డు గ్యారంటీ!

Fri 19th May 2017 09:36 PM
jr ntr,geleya geleya,kannada movie,chakravyuha,punit raj kumar  ఆ ఊపు చూస్తుంటే..ఎన్టీఆర్‌ కి అవార్డు గ్యారంటీ!
NTR Nominated As Best Debut Singer ఆ ఊపు చూస్తుంటే..ఎన్టీఆర్‌ కి అవార్డు గ్యారంటీ!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి నటుడు, డ్యాన్సరే కాదు.. మంచి డైలాగ్‌ డెలివరితో పాటు మంచి గాయకుడు కూడా. గతంలో తాను నటించిన పలు తెలుగు చిత్రాలలో ఆయన ఆ విషయం నిరూపించుకున్నాడు. కాగా ప్రస్తుతం వరుస ఊపులో ఉన్న ఆయన బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' అనే డిఫరెంట్‌ మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్‌ బెస్ట్‌ డెబ్యూ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులకు నామినేట్‌ అయ్యాడు. 

గతంలో చాలా పాటలు పాడిన ఆయన ఇంకా డెబ్యూ సింగర్‌ ఏమిటి? అనే అనుమానం అవసరం లేదు. ఇటీవల ఆయన కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా తమన్‌ సంగీతంలో రూపొందిన 'చక్రవ్యూహ' చిత్రంలో 'గెలియో..గెలియో' పాటను పాడాడు. కేవలం పునీత్‌పై ఉన్న అభిమానంతోనే ఆయన ఆ పాటను ఓకే చేశాడు. 

కాగా ఆయన పాడిన ఈ పాటకు గాను కన్నడ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కేటగిరిలో ఆయన బెస్ట్‌ డెబ్యూ సింగర్‌గా నామినేషన్‌ దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ ఆ పాటను పాడిన విధానం, ఊపు, ఆ పాటకు వచ్చిన ఆదరణ వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఎన్టీఆర్‌ ఈ అవార్డును చేజిక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. కాగా త్వరలో ఎన్టీఆర్‌ బర్త్‌డే కానుకగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'జై లవకుశ' ఫస్ట్‌లుక్‌ విడుదలకానుంది. ఇక సెప్టెంబర్‌1న ఆయన నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

NTR Nominated As Best Debut Singer:

Ntr has been nominated for best debut singer award for 'Geleya Geleya' song in the forthcoming Filmfare Awards Ceremony. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ