Advertisementt

చంద్రబాబుని అంచనా వేయలేం..!

Fri 19th May 2017 09:29 PM
chandrababu naidu,2019 elections,andhra pradesh,janasena,bjp,chandrababu strategy  చంద్రబాబుని అంచనా వేయలేం..!
Chandrababu Naidu Political Strategies For 2019 Elections చంద్రబాబుని అంచనా వేయలేం..!
Advertisement
Ads by CJ

ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా మోదీని ఏమీ అనవద్దని, జగన్‌పై దాడి చేయాలని చంద్రబాబు సూచిస్తున్నాడు. మరోవైపు జగన్‌.. మోదీ వైపుకు వెళ్లితే ఎక్కువ విషయాలలో లాభపడేది మాత్రం బాబే. ఎందుకంటే మరలా ముస్లిం మైనార్టీ ఓట్లకు ఎర వేయవచ్చు. ఇక పనిలో పనిగా పవన్‌ సైతం బిజెపితో కలిసిన వైసీపీకి కూడా దూరంగా ఉంటాడు. తద్వారా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక వస్తుంది. 

మరోవైపు హంగ్‌ అసెంబ్లీ వస్తే చంద్రబాబుకు పవన్‌ తాను గెలిచిన స్థానాలు తక్కువైనా, ఎక్కువైనా బాబుకే మద్దతునిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చంద్రబాబు ఎవ్వరికీ నమ్మకమైన మిత్రుడు కాదని చాలా మంది వాదిస్తున్నారు. గాలి వాటం ఎటుంటే అటు పోయే నేర్పరి. కొంతకాలం వామపక్షాలతో సై అంటాడు. వాజ్‌పేయ్‌, మోదీల హవా ఉన్నప్పుడు వామపక్షాలను పక్కనపెట్టి బిజెపికి జై కొడతాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఎవ్వరీకీ మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడి, మూడో కూటమి బలపడితే బాబు దానికే సపోర్ట్‌ చేస్తాడనే అభిప్రాయం మోదీలో బలంగా ఉందని చెబుతారు. కాబట్టే ఆయన బాబును గుడ్డిగా నమ్మడం లేదు. 

మరోవైపు పవన్‌ తనని, బిజెపిని తిడుతున్నా, చంద్రబాబు, టిడిపి విషయంలో మెతకగా ఉన్నాడు. ప్రధానిని, అందునా తమ టిడిపి కలిసి ఉన్న ఎన్డీయేకు సారధ్యం వహిస్తున్న బిజెపిని పవన్‌ విమర్శిస్తుంటే స్థానిక బిజెపి నాయకులు తప్ప టిడిపి తమ్ముళ్లు మౌనంగా ఉండటం కూడా మోదీ గుర్రుకు కారణమైందంటున్నారు. చూద్దాం.. రాబోయే కాలంలో మరలా జనసేన, వామపక్షాలతో చంద్రబాబు చేరినా చేరవచ్చు. 

Chandrababu Naidu Political Strategies For 2019 Elections:

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu Political Strategies for 2019 General Elections.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ