భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే. దేశానికి కపూర్లు,ఖాన్‌లే దిక్కు. వారు లేకపోతే సినిమా ఇండస్ట్రీలే లేవు. ఉత్తరాది సినిమా వారికి దక్షిణాదిపై చిన్నచూపు వంటివి ఎప్పటి నుంచో ఉన్నవే. ఉత్తరాది పెత్తనం, దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమ అనేవి అన్ని రంగాలలలో ఉన్నా రాజకీయంగా, సినిమా వారిలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. 'బాహుబలి' చిత్రంతో రాజమౌళి దానిని తిరగరాశాడు. ఇవి ఎవరి నుంచైనా వింటున్న మాటలు.
వీటినే తాజాగా మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అన్నాడు. బాహుబలి ఉత్తరాది వారికి చెంపపెట్టు. తెలుగు వారి సత్తాను చాటిన చిత్రం 'బాహుబలి'. 'బాహుబలి' సాగిస్తున్న ప్రభంజనం ఉత్తరాది వారికి ముఖ్యంగా బాలీవుడ్‌కి చెంపపెట్టు. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఎవ్వరూ సాధించని రికార్డులను కొల్లగొడుతున్న బాహుబలిని తీసిన రాజమౌళి అభినందనీయుడు. ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని అధ్యాయాన్ని రాసిన బాహుబలి టీమ్ కి నా అభినందనలు.
ఇలాంటి సినిమాను తీసి ప్రపంచానికి తెలుగు వారి సత్తాను పరిచయం చేసిన రాజమౌళి అండ్ టీమ్ ను కీర్తించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా గర్వంగా ఉందని తాజాగా అల్లు అరవింద్ వ్యాఖ్యనించడం విశేషం.