కమెడియన్‌గా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న సప్తగిరి హీరోగా ఓ చిత్రం ప్రారంభించాడు. ఆ చిత్రానికి 'కాటమరాయుడు' టైటిల్ పెట్టి సినిమా ముగింపు దశకు తీసుకొచ్చారు. ఇంతలో పవన్, శరత్‌మరార్‌లు అదే టైటిల్‌పై మోజుపడ్డారు. కానీ ఆ టైటిల్ సప్తగిరి పేరు మీద రిజిష్టర్ అయి ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు. దాంతో శరత్‌మరార్ ఈ చిత్రం టైటిల్ తమకు కావాలని కోరాడు.
పవన్, శరత్‌మరార్‌లు అడిగిన వెంటనే ఆ టైటిల్‌ను పవర్‌స్టార్‌కి ఇచ్చివేసి తన చిత్రానికి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరు పెట్టుకున్నారు. సినిమా బాగానే ఆడింది. సాధారణంగా ఎక్కువగా సినిమా ఫంక్షన్లకు హాజరుకాని పవన్ సప్తగిరిపై ఉన్న అభిమానంతో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో కార్యక్రమానికి రావడమే కాదు.. ఆయన హీరోగా విజయం సాధించాలని,సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆశీర్వదించాడు. అనుకున్నదే జరిగింది.
తాజాగా ఓ సినిమా అవార్డులలో ఈ చిత్రానికి ఉత్తమ పాపులర్ చిత్రం అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా సప్తగిరి ఉద్వేగానికి లోనయ్యాడు. తాను చిరంంజీవి ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాలలోకి రావాలని, ఈ ఫీల్డ్‌లో స్ధిరపడాలని కలలు కన్నాను. కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకోవడం కూడా ఎంతో సంతోషం. చిరంజీవి గారు నాకు అవార్డును ఇస్తున్న ఫొటోనే మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుంటాను. ప్రతిరోజు ఆ ఫొటోను చూస్తే నాకు చాలు.. అంటూ చిరంజీవి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని తనకు మెగాబ్రదర్స్ ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్పుకొచ్చాడు.