Advertisementt

ఈ ఒక్కడైనా కోరిక తీరుస్తాడా..?

Tue 16th May 2017 11:58 AM
manchu manoj,manchu vishnu,mohan babu,okkadu megiladu movie  ఈ ఒక్కడైనా కోరిక తీరుస్తాడా..?
Manchu Manoj Follow Manchu Vishnu! ఈ ఒక్కడైనా కోరిక తీరుస్తాడా..?
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీలో కలెక్షన్‌ కింగ్‌గా పేరుతెచ్చుకున్న మోహన్‌ బాబు విలన్‌గా, సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేస్తూ, కామెడీ టచ్‌ ఇస్తూ, హీరోగా కూడా బాగానే రాణించాడు. నిర్మాతగా కూడా సక్సెస్‌ అయ్యాడు. కానీ ఆయన పుత్రరత్నాలైన మంచు విష్ణు, మంచు మనోజ్‌లు, కుమార్తె మంచులక్ష్మిలు మాత్రం ఏ విభాగంలో కూడా రాణించలేకపోతున్నారు. నటునిగా మంచు విష్ణుతో పోల్చుకుంటే మంచు మనోజే బెటర్‌ అనేది చాలా మంది అభిప్రాయం. 

కానీ ఈయనకు ఇప్పటి వరకు ఒక్క సరైన సక్సెస్‌ కూడా రాలేదు. కానీ మంచు విష్ణు మాత్రం కాస్త బెటర్‌గా 'ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా' వంటి చిత్రాలతో ఫర్వాలేదనిపించాడు. కానీ మనోజ్‌లో టాలెంట్‌తో పాటు విభిన్న చిత్రాలు చేయాలని తపన ఉన్నా కూడా సక్సెస్‌ మాత్రం రాలేదు. ఇక ఆయన తాజాగా 'ఒక్కడు మిగిలాడు' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

శనివారం విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి మాత్రం మంచి ఆదరణే లభిస్తోంది. గమ్మత్తేమిటంటే.. గతంలో మనోజ్‌ నటించిన చిత్రాల పోస్టర్లు, టైటిల్స్‌, ఫస్ట్‌లుక్స్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ అన్నీ ఆకట్టుకున్నా కూడా సినిమాలు తేలిపోయాయి. అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో తుపాకుల మద్య మనోజ్‌ ఉన్న పోస్టర్‌ బాగానే ఉంది. ఇందులో ఆయన శ్రీలంక ఎల్టీటీటీఈ తీవ్రవాదిగా, ప్రభాకరన్‌ తరహా పాత్ర చేస్తున్నాడు. 

ఇక ద్విపాత్రాభినయంలో భాగంగా విద్యార్థినాయకునిగా కనిపిస్తానంటున్నాడు. ఈ చిత్రానికి విజయ్‌ ఆండ్రూ దర్శకత్వం వహిస్తున్నాడు.కానీ ఎల్టీటీటీఈ గురించి నేటితరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పెద్దగా తెలియదు. ఇది కేవలం తమిళనాడులో రగిలే అంశం మాత్రమే. రాజీవ్‌ హత్య సమయంలో మాత్రం దేశాన్ని ఆకర్షించింది. మరి ఈ చిత్రం ద్వారా ఏదో ఒక వివాదం తెరపైకి తెచ్చి తన అన్న రూట్‌లోనే సక్సెస్‌ కొట్టాలని ఈ తమ్ముడు భావిస్తున్నట్లున్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Manchu Manoj Follow Manchu Vishnu!:

Mohan Babu is known as the Collection King in the manchu Family and is doing well with the comedy touch and the hero, doing supporting characters.  Manchu Manoj Better is the opinion that the actor is more like Manchu Vishnu. This younger brother wants me to succeed in the same way.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ