పవన్ కళ్యాణ్ సినిమాల సినిమాలు ఒప్పుకుంటూ తెగ బిజీగా వున్నాడు. మరో వైపు 2019 ఎన్నికల కోసం జనసైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించి అభిమానులతో భేటీలు నిర్వహిస్తున్నాడు. మరి పవన్ జోడెద్దుల బండిని ఒంటి చేత్తో లాగగలడా? ఏమో ఏం జరుగుతుందో కానీ ఇప్పుడు పవన్ మాత్రం అటు సినిమాలు ఇటు రాజకీయాలను దున్నేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ ఇప్పుడు జాలీ ఎలెల్బీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో హాట్ హాట్ న్యూస్ ప్రచారం జరుగుతుంది. అలాగే ఏ.ఎం రత్నంతో కమిట్ అయిన సినిమా ఉండనే వుంది. మరి సినిమా షూటింగ్లో అంత బిజీ అయిన పవన్ రాజకీయాలకు న్యాయం చేయగలడా? అనే ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ.
మరో వైపు అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ అవసరమైతే సినిమాలకు చిన్న బ్రేక్ ఇస్తానని చెబుతున్నాడు. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఎప్పటి నుండో చెబుతున్నారు. మరి అలాంటప్పుడు పవన్ సినిమాలకు సైన్ చెయ్యకుండా ఉండాలి. ఒకవేళ సైన్ చేసిన సినిమాలు చెయ్యకుండా వదిలేస్తే నిర్మాత అన్యాయమైపోతాడు. అలా అని సినిమాలు చేస్తూ ఉంటె రాజాకీయాల్లో వెనకబడిపోతాడు. మరి పవన్ అన్నగారు చిరంజీవి తనలా పవన్ కాదని సినిమాలు, రాజకీయాలను పవన్ ఒంటి చేత్తో హ్యాండిల్ చేయగలడని చెప్పాడు. కానీ ఇప్ప్పుడు చిరు చెప్పినట్టు పవన్ రెండిటీని హ్యాండిల్ చెయ్యలేక చేతులెత్తేసే పరిస్థితుల్లో వున్నాడు.
మరి సినిమాలకు బ్రేక్ ఇస్తే అభిమానులు ఫీల్ అవుతారు. రాజకీయాల్లో డల్ గా ఉంటే ఇతర పార్టీలు తొక్కేస్తాయి. అందుకే రాజకీయాల్లో పవన్ యాక్టీవ్ అవడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే అనంతపురంలో పవన్ పాదయాత్ర చేపడుతున్నాడు. అలాగే అధికార పార్టీలను ఢీ కొట్టడానికి పవన్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడని అంటున్నారు. వీటి కోసమే పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి బ్రేక్ ఇస్తే బావుంటుంది లేకుంటే ఫ్యాన్స్ నానా హంగామా చేసేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో...!