Advertisementt

చంద్రబాబు, జగన్‌...దొందు దొందే...!

Mon 15th May 2017 06:23 PM
chandrababu naidu,ys jagan mohan reddy,andhra pradesh,delhi,bjp,modi  చంద్రబాబు, జగన్‌...దొందు దొందే...!
Chandrababu and YS Jagan's Delhi Politics చంద్రబాబు, జగన్‌...దొందు దొందే...!
Advertisement

ఏపీ ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఎటువంటి ఆధారం లేకుండా విడదీసిన ఏపీని చంద్రబాబు నాయుడైతేనే తన అనుభవంతో బాగు చేస్తాడని ప్రజలు భావించారు. కానీ ఈ మూడేళ్ల కాలంలో అది వృధా ఆశేనని, అడియాసగానే మిగిలిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏం చేస్తున్నాం..? ఈ మిగిలిన రెండేళ్లలో ఏమి చేస్తానో చెప్పకుండా విజన్‌ 2050 అంటున్నాడు. విజన్‌ మంచిదేకాని మనం చనిపోయిన తర్వాత వచ్చే ఫలాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. విజన్‌ 2050 అంటే చంద్రబాబే కాదు.. ఈ తరానికి చెందిన 90శాతం మంది జీవించి ఉండరు. స్వల్పకాలిక గోల్స్‌ పెట్టుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లా పరిపాలించకుండా ఏవేవో చందమామకథలు చెబుతున్నావు. 

మరోపక్క జగన్‌ది అదే పరిస్థితి. ఆయన తన ఇల్లు తాను చక్కదిద్దుకోవడానికి, తన నేరాలను ఎలా మాఫీ చేసుకోవాలా? అనే ధ్యాసలో ఉన్నాడు. ఒకవైపు జగన్‌.. మోదీని కలిశాడు. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన బాబు ఢిల్లీలో ఆరుగంటలు రహస్యంగా గడిపాడు. టిడిపి వారేమో జగన్‌.. మోదీతో ఏమి మాట్లాడాడు? అని అడుగుతుంటే, వైసీపీ వారు ఆ ఆరు గంటలు బాబు ఏమయ్యాడని తమలో తప్పులు తాము కప్పిపుచ్చుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌, బిజెపిల గురించి ఎంత మాట్లాడుకున్నా వృధాయే. వామపక్షాలు నామమాత్రంగా మిగిలాయి. జనసేనాధిపతి ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారే ధైర్యం చేయడం లేదు. ఇలా చూస్తే అందరూ దొంగలే అని చెప్పకతప్పదు. 

Chandrababu and YS Jagan's Delhi Politics:

In the limited context of Andhra politics, the Narendra Modi-Jaganmohan Reddy meeting in New Delhi on Wednesday has set the cat among the Telugu Desam Party pigeons. AP Chief Minister Chandrababu Naidu's unannounced visit to New Delhi and his 'disappearance' for over six hours has become a mystery wrapped inside an enigma. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement