Advertisementt

'స్పైడర్‌'కు మరో అంతరాయం..!

Mon 15th May 2017 12:23 PM
spyder movie,spyder interruption,mahesh babu,director murugadoss,nims hospital,ts youth is angry  'స్పైడర్‌'కు మరో అంతరాయం..!
Another Interruption For 'spyder' 'స్పైడర్‌'కు మరో అంతరాయం..!
Advertisement
Ads by CJ

అసలే..సాగుతూ... కొనసాగుతూ పోతున్న మహేష్‌బాబు-మురుగదాస్‌ల 'స్పైడర్‌'చిత్రం షూటింగ్‌కి తాజాగా మరో దెబ్బ ఎదురైంది. ఈసారి తెలంగాణ యువత నుంచి ఈ అడ్డంకి ఎదురైంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను యాదాద్రి, బీబీనగర్‌ వద్ద గల నిమ్స్‌ వైద్యశాలలో జరపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం నుంచి, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ నుంచి షూటింగ్‌కు అనుమతి తెచ్చుకున్నారు.

కానీ ఈ నిమ్స్‌ ఆసుపత్రిని వినియోగంలోకి తెచ్చి పేదలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ద తెలంగాణ యువతకు కోపం తెప్పించింది. నిమ్స్‌లో వైద్యసేవలనుప్రారంభించడంలో శ్రద్ద చూపించకుండా ఇలా షూటింగ్‌లకు మాత్రం ఈ నిమ్స్‌ని ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ ప్రతిఘటన చూసిన నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ సైతం షూటింగ్‌ పర్మిషన్‌ను రద్దు చేశారు. దాంతో షూటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న స్పైడర్‌ చిత్ర యూనిట్‌ మూటాముల్లె సద్దుకుని వేరే లోకేషన్‌ వేటలో ఉందని సమాచారం. 

Another Interruption For 'spyder':

The shooting of Mahesh Babu-Murugadoss's 'Spider' continues to be a fresh blow, Another Interruption.  Recently the film was scheduled to be shot at Nims Hospital, BBnagar, Yadavri. Telangana youth is angry.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ