Advertisementt

ఇతనికి గుండె కుడి వైపు వుందట..!

Sun 14th May 2017 04:12 PM
hero nikhil,kesava movie,kesava audio release on 13th may 2017,ritu varma,isha koppikar  ఇతనికి గుండె కుడి వైపు వుందట..!
Keshava Trailer Talk ఇతనికి గుండె కుడి వైపు వుందట..!
Advertisement
Ads by CJ

వరసగా థ్రిల్లర్ చిత్రాలలో నటిస్తూ హిట్స్ కొడుతున్న నిఖిల్ ఇప్పుడు తాజాగా నటించిన 'కేశవ' చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. శనివారం జరిగిన ఆడియో లో 'కేశవ' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సంచలనాలకు తెరలేపిన 'కేశవ' చిత్రం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో సినిమాపై వున్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే 'కేశవ' చిత్రం సూపర్ హిట్ అయ్యేలాగే కనబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి ఒక లోపం ఉంటుంది. అందిరికి గుండె ఎడమ వైపు ఉంటే నిఖిల్ కి మాత్రం కుడి వైపు ఉంటుంది. అందుకే ఏ పని చెయ్యాలన్నా చాలా కూల్ గా పద్ధతిగా చెయ్యాలని... అలాగే మర్డర్ తో సహా ప్రశాంతంగా చెయ్యాలని నిఖిల్ చెప్పే డైలాగ్ థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి పూనకం వచ్చేసేలా వుంది.

మరి ప్రశాంతంగా ఎటువంటి ఆధారాలు లేకుండా మర్డర్స్ చేస్తున్న నిఖిల్ ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఇషా కొప్పికర్ నటిస్తుంది. ఇక నిఖిల్ కి జోడిగా 'పెళ్లి చూపులు' హీరోయిన్ రీతూ వర్మ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే శుక్రవారం అంటే మే 19న ప్రేక్షకుల కుందుకు రాబోతుంది.

Keshava Trailer Talk:

As per story hero has a strange physical deformity. He has his heart gets located on the right side of the chest instead of the left. As a result, he needs to get his emotions like pain, haste etc. are controlled. Else, his heart rate increases abnormally and finally it results in his death. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ