ముంబై మాఫియాపై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా వర్మకు అది అత్యంత ఇష్టమైన అంశం. కాగా అప్పుడెప్పుడో దర్శకుడు మణిరత్నం చెన్నై వాడైన ముంబై డాన్ ముదలియార్ వరదరాజన్ కథను 'నాయకుడు'గా కమల్‌తో తీశాడు. ఇక ముదలియార్‌కి శిష్యుడు, ఆయన కనుసైగల్లో పెరిగిన మరో చెన్నై వారసత్వమైన ముంబై గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్, రియల్‌ఎస్టేట్, హవాలా, మనీ లాండరింగ్, మత్తు పదార్దాలు, సినిమాలకు ఫైనాన్స్, బాంబు పేలుళ్లలలో పేరున్న హాజీమస్తాన్ జీవిత చరిత్రను ఇండియన్ సూపర్‌స్టార్ రజనీ హీరోగా 'కబాలి' ఫేం రంజిత్‌పా దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా రజనీ 161వ చిత్రంగా నిర్మిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ లుక్ పలువురిని ఆకట్టుకుంటోంది.
ఇక చిన్ననాటి నుంచి పేదరికంతో నానా అగచాట్లు పడిన హాజీమస్తాన్‌కి విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక. దాంతో డాన్‌గా మారి ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా లింక్‌లు పెట్టుకున్నాడు. ఇక హాజీ మస్తాన్ వారసుడినని చెప్పుకునే ముంబైకి చెందిన డాన్ వలార్‌పులగమ్ అనే వ్యక్తి రజనీని ఈ చిత్రం తీయకూడదని, తీసినా కూడా తప్పుగా చూపకూడదని, కావాలంటే వాస్తవాలు తానే ఇస్తానని, ఆయనో గొప్ప మనిషి అని, కాదని సినిమా తీస్తే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడమని బెదిరిస్తూ రాసిన లేఖ ముంబైలోని ఓ మీడియా ప్రతినిధికి దొరకడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
ఈ వలారుపులగమ్ ప్రస్తుతం భారతదేశ మైనార్టీస్ సురక్ష మహాసంఘ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉండటం విశేషం. తెల్ల లాల్చీ, ఫైజమా, మెర్సిడెజ్ బెంజ్‌లో స్టైల్‌గా తిరిగే హాజీమస్తాన్ పాత్రను 'బాషా , కబాలి'ల రేంజ్‌లో రజనీ అయితేనే చేయగలడని అందరూ నమ్ముతున్నారు. చూద్దాం.. పరిస్థితి ఎంతదాకా వెళ్తుందో...!