కాజల్ అగర్వాల్.. చాలా కాలంగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో నటిస్తూ దూసుకుపోతోంది. తెలుగులో అయితే రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్, చిరంజీవి.. ఇలా అందరితో నటించింది. కాగా ఈ భామకు కృష్ణవంశీ తీసిన 'చందమామ' చిత్రం మంచి పేరును తీసుకొచ్చింది. కానీ హీరోయిన్‌గా ఈమె పరిచయమైన చిత్రం నందమూరి కళ్యాణ్‌రామ్-తేజల కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం'. ఇక ఈమెకు హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ ప్రస్తుతం ఫ్లాప్‌ల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రానా హీరోగా 'నేనే రాజు...నేనే మంత్రి' చిత్రం తీస్తున్నాడు. తానున్న బిజీలో ఎన్నో చిత్రాలకు నో చెప్పిన కాజల్ అగర్వాల్ మాత్రం దర్శకుడు తేజ అడిగిన వెంటనే అందునా రానా సరసన నటించేందుకు ఓకే చెప్పేసింది.
మరోపక్క ఆమె సరసన నటించిన తొలి హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రస్తుతం ఆయనకు కూడా హిట్లు లేవు. కానీ త్వరలో ఆయన 'ఎంఎల్‌ఏ' (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రం చేయనున్నాడు. ఇందులో కూడా కళ్యాణ్‌రామ్ సరసన నటించేందుకు ఈ బ్యూటీ ఓకే చెప్పింది. మొత్తానికి తనకు మొదటి అవకాశం ఇచ్చిన వారి రుణం ఈ అమ్మడు గుర్తుంచుకొని ఇలా తీర్చుకోవడం గ్రేటేనని చెప్పాలి. ఇక ఇప్పటికే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈమె 'ఎంఎల్‌ఏ'తో కళ్యాణ్‌రామ్ సరసన నటించి త్వరలో బాలయ్య సరసన కూడా నటిస్తే లెక్క సరిపోతుంది.