Advertisementt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాముడైతే...!

Sat 13th May 2017 07:38 PM
ram charan,mega power star,lord rama,allu aravind ramayanam,ram charana as lord rama,fan made poster  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాముడైతే...!
Ram Charan as Lord Rama Fan Made Poster మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాముడైతే...!
Advertisement
Ads by CJ

బాహుబలి కోసం ఆ టీమ్ సభ్యులు ఎంతగా కష్టపడితెనేమిటి ఆ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి ఆ కష్టాన్ని ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ టీమ్ సభ్యులు. ఎంతో భారీగా తెరకెక్కిన బాహుబలి అంతే భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతూ ఇండియాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక బాహుబలిని చూసిన తర్వాత చాలామంది నిర్మాతలు పెద్ద ప్రాజెక్ట్ లు నిర్మించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ వ్యక్తి 1000 కోట్ల బడ్జెట్ తో మోహన్లాల్ తో మహాభారత ని నిర్మిస్తానని ఎనౌన్స్ కూడా చేసాడు. అలాగే రితేష్ దేశముఖ్ శివాజీ బయోపిక్ ని 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మరోపక్క టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తానని మీడియా ముఖంగా అనౌన్స్ చేశాడు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన రామాయణంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ మొదలైంది. అంత భారీ బడ్జెట్ సినిమాకి ఇంకా డైరెక్టర్ ని గాని నటీనటుల్ని గాని ఇంతవరకు సెట్ చెయ్యలేదు. కానీ నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకెళుతుందని మాత్రం చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ రామాయణంలో నటించే నటీనటులు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. అల్లు అరవింద్ తీయబోయే రామాయణంలో రామ్ చరణ్ రాముడిగా... రానా రావణాసురుడుగా ఫిక్స్ చేసేసారు మెగా ఫ్యాన్స్. ఇక రామ్ చరణ్ ని రాముడిగా కూడా ఫ్యాన్ మేడ్ డిజైన్ ఒక దానిని తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ రాముడి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

అయితే అల్లు అరవింద్ తీసే 3డి రామాయణంలో నటీనటులు గురించి చెప్పేవరకు ఈ రకమైన ఊహాగానాలు, డిజైన్లు ఫ్యాన్స్ చేస్తూనే ఉంటారు. మరి ఆ ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలంటే అల్లు అరవింద్ రామాయణంలో నటించే నటీనటులను త్వరగా ఎంపిక చేస్తే పోలా!

Ram Charan as Lord Rama Fan Made Poster:

Mega Producer Allu Aravind's official announcement of great Indian epic 'Ramayanam' to be made as a magnum opus with an astronomical budget of Rs.500 crores, has made a huge splash among film circles.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ