'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం గత ఏప్రిల్ 28 న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1200 కోట్లకు పైనే కలెక్షన్స్ ని బాహుబలి సాధించినట్లుగా చెబుతున్నారు. ఇక త్వరలోనే 1500 కోట్ల క్లబ్బు ని బాహుబలి సృష్టించేందుకు రెడీ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి ఇంతలా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుంటే డైరెక్టర్ రాజమౌళి కి సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ కామెడీ ప్రశ్నలకు రాజమౌళి సమాధానం చెప్పాలని, లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కదిలిస్తామని కామెంట్స్ చేస్తుండటం..నిజంగానే నవ్వు తెప్పించక మానదు. సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న ప్రశ్నలివే.
1 . అమరేంద్ర బాహుబలి తండ్రి ఎలా చనిపోయాడు? దాని గురించి వివరణ మాకు కావాలి.
2 . కట్టప్ప కుటుంబం ఎందుకు మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసలుగా మారింది? మాకు తెలియాలి.
3 . భల్లాల దేవుని భార్య ఎవరు. భద్ర ఎవరికి పుట్టాడు? దీనపైనా వివరణ కావాలి.
4 . తమన్నా ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్న బలమైన కారణం ఏమిటి?
5 . ఊ అంటే ఆ అంటే కాలకేయులు ఎందుకు దాడి చేస్తుంటారు? మొదటి పార్టులో మిగిలిన ముక్కలని తగిలించే ప్రయత్నమా?
6 . అవంతి, మహేంద్ర బాహుబలి ల వివాహము మేము చూడాలనుకుంటున్నాము.
7 . శివగామి కుంపటి నెత్తిమీద పెట్టుకుని వెడుతుండగా ఏనుగులు ఓవర్ ఏక్షన్ చేసిన సందర్భంలో రధాలున్న గదిలో అమరేంద్ర బాహుబలి ఏం చేస్తున్నాడు? అది కూడా మాకు చూపించాలి.
8 . ఏనుగుల రియాక్షన్ వెనుక ఉన్న కారణం ఏమిటి?
9 . దేవసేన ఏరిన పుల్లలకి మూలమేమిటి? అక్కడ చెట్ల కూడా పెద్దగా లేవు. మరి పుల్లలు ఎక్కడినుండి వచ్చాయి.
10 . ఇలా కొన్నివేల సందేహాలు ఉన్నాయి. కనుక వీటన్నిటిని తీర్చడానికి రాజమౌళి కనీసం బాహుబలిని 100 భాగాలైనా తీయాల్సి ఉంటుంది. ఒక వేళ 100 భాగాలూ చాలవనుకుంటే 1000 అయినా తియ్యాలి. దీనికి ముందుగా హామీ ఇవ్వాలి. ఈవిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
11 . రాజమౌళి ఇకపై బాహుబలి సినిమా విషయమై అన్ని సందేహాలు నివృత్తి అయ్యే వరకు మరో సినిమా చెయ్యకూడదు. అలా తియ్యకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
12 . తప్పు చేసావు శివగామి అని కట్టప్ప అంత చొరవగా అనడానికి గల కారణమేమిటి?
13 . బాహుబలి సినిమా సందేహాలు నివృత్తి చెయ్యకుండా ఎన్నికలు పెడితే మోడీనైనా, చంద్రబాబునైనా, కేసీఆర్ నైనా ఓడిస్తాం. బాహుబలి సందేహాలు తీరేవరకు ఈ దేశంలో ఎన్నికలు రద్దు చెయ్యాలి.
14 . అసలు సుబ్రహ్మణ్యం స్వామి ఈ విషయమై కోర్టులో ఇంతవరకు పిల్ ఎందుకు వెయ్యలేదు?
ఇలా అనేక రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
విజయేంద్ర ప్రసాద్ పెన్నులో ఇంకయిపోయినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఒకవేళ దొరికిన సినిమాగా తీయడానికి రాజమౌళి కాదు, వాళ్ళ అబ్బాయి హయం కూడా చాలదు. సో..లైట్ తీసుకుని హాయిగా నవ్వేసుకోండి.