ప్రణీత సుభాష్ అంటే తెలియని వారుండరు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో వన్ అఫ్ ద హీరోయిన్ గా చేసిన ప్రణీత పలు సినిమాల్లో సోలో హీరోయిన్ గా నటించింది. కానీ ఎక్కువగా ప్రణీతకి సెకండ్ హీరోయిన్ గానే అవకాశాలు వచ్చాయి. అయితే ఆమెకు కాలం కలిసిరాక తెలుగులో అవకాశాలు రాక వేరే భాషకు వలస వెళ్ళింది. అక్కడ కూడా ఆమె సక్సెస్ ని అందుకోలేక ఇప్పుడు వ్యాపార రంగంపై దృష్టి సారించింది. ఇప్పుడు చేస్తున్న హోటల్ వ్యాపారాన్ని ఇతర పట్టణాల్లో కూడా విస్తరించాలని అనుకుంటుందట. అలాగే సినిమాలను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే నిర్మాతగా మారడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
టాలీవుడ్, కోలీవుడ్ లోని స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించడానికి ప్రణీత సన్నాహాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే హోటల్ వ్యాపారంలో సక్సెస్ అయిన ప్రణీత ప్రొడక్షన్ ఫీల్డ్ లో కూడా సక్సెస్ అవ్వాలని తాపత్రయపడుతుందట. మరి ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు ఏదో ఒక వ్యాపారంతో ఇలా ఇండస్ట్రీని అంటిపెట్టుకోవడమే బెటర్ కదా..!