బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పుడు బిజెపి బలహీనంగా ఉండే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఎంత చేసినా క్రిస్టియన్లు, ముస్లింలు బిజెపి వైపు రారని కనిపెట్టిన ఆయన తెలంగాణ సీఎం మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశంతో పాటు పలు సమస్యలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో నేడు బలమైన రెడ్డి సామాజిక వర్గం ప్రాముఖ్యతను కేసీఆర్ తగ్గిస్తున్నాడనే విమర్శ ఉంది.
దీంతో అమిత్‌షా కాంగ్రెస్‌లోని పలువురు అసంతృప్త రెడ్డి నాయకులపై దృష్టి పెట్టారు. టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, డి.కె.అరుణ, సుదర్శన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలతో పాటు బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీధర్‌బాబుతో మంతనాలు సాగిస్తున్నారు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ, మందకృష్ణ మాదిగతో పాటు పలువురు బలమైన మాదిగ నాయకులకు, బిసీ కమిషన్ చట్టబద్దతను చూపిస్తూ ఆర్.కృష్ణయ్యతోపాటు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ పలువురు బిసీ నాయకులపై కూడా కన్నేశాడు. మొత్తానికి త్వరలో తెలంగాణలో రాజకీయ సమీకరణలను మార్చాలని అమిత్‌షా వ్యూహం రచిస్తున్నారు.