పవన్ సరసన 'కొమరం పులి'లో నటించిన హీరోయిన్ నికీషాపటేల్. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. దాంతో అడపాదడపా సెకండ్‌గ్రేడ్ హీరోలతో, లోబడ్జెట్ చిత్రాలతో నెట్టుకొస్తోంది. అందం, ఎక్స్‌పోజింగ్ చేసేందుకు ఏమాత్రం అభ్యంతరం లేకపోయినా ఆమెపై ఐరన్‌లెగ్ ముద్రపడింది.
ఇక తాజాగా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 'బాహుబలి' రెండు భాగాలను చూశానని, ఈ రెండు చిత్రాలు హాలీవుడ్‌స్థాయిలో ఉన్నాయని చెప్పి, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసింది. కాగా ఇటీవల తాను ఓ హీరోను 'బాహుబలి' చిత్రం చూశారా? డైరెక్టర్ భలే తీశాడుకదా..! అని అడిగానని దానికి అతను తాను ఆ చిత్రం చూడలేదని, ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అని అడిగాడని మండిపడింది.
దేశచరిత్రను మార్చిన ఈ చిత్రం చూడకపోయినా కనీసం రాజమౌళి పేరు తెలియకపోవడం ఏమిటి? అందునా అలా మాట్లాడిన వ్యక్తి పరభాషా నటుడు కాదు... తెలుగు వాడేనని బాంబు పేల్చింది. ఇంతకీ ఎవరా హీరో? అని అడిగితే ఆ హీరో పేరు చెప్పను. అలాంటి వ్యక్తి పేరు నా నోటితో చెప్పడం అవమానంగా భావిస్తున్నానని అంది. మొత్తానికి ఆమె నిజంగా చెప్పిందో? లేక తాను మరలా టాలీవుడ్ వార్తల్లో నిలబడేందుకు చెప్పిందో తెలియదు గాని ఆ హీరో ఎవరనేది అర్ధం కాని విషయంగా మారింది.