నిన్నటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీనే. దీనిని ఇప్పుడు రాజమౌళి తన తెలుగు చిత్రం 'బాహుబలి'తో తిరగరాసి, తెలుగు చిత్రం కూడా 1000కోట్లు వసూలు చేయగలదని నిరూపించాడు. ఇదే సమయంలో 'బాహుబలి-ది కన్‌క్లూజన్'చిత్రం 1500కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో దాదాపు 750కోట్లకు అటు ఇటుగా ఆగిపోయిన 'పీకే' చిత్రం రికార్డులకు దరిదాపుగా వచ్చిన తన 'దంగల్' చిత్రాన్ని తాజాగా చైనీస్ భాషలో ఏకంగా 9000స్క్రీన్లలోరిలీజ్ చేశాడు అమీర్. ఈ చిత్రానికి అక్కడ అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. దాంతో కలెక్షన్లు కూడా జోరుగానే ఉన్నాయి. చైనాతో సాధించిన కలెక్షన్లు కలిపి ఎలాగైనా 'దంగల్'ను కూడా 1000కోట్ల క్లబ్‌లో చేర్చేందుకు అమీర్ ఉత్సాహం మీద ఉన్నాడు.
మరోవంక ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్న సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్', త్వరలో పట్టాలెక్కనున్న అమీర్‌ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రాలతోమరలా తమ సత్తా చూపి, 'బాహుబలి' నుంచి ఆ రికార్డును తిరగి లాగేసుకోవాలని ఖాన్‌లు రెడీ అవుతున్నారు. అయినా ఓ హిందీ చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టినా కూడా డబ్బింగ్ చిత్రంగా 'బాహుబలి' రికార్డుకు ఎవ్వరూ దరిదాపుల్లో దాటలేరనేది వాస్తవం. ఇక ఖాన్ చిత్రాలకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి సిటీలలో తప్ప దక్షిణాదిలో ఎలాంటి మార్కెట్ లేదు. గతంలో వారు తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చేసిన చిత్రాలు కూడా పెద్దగా ఇక్కడ మెప్పించలేకపోయాయనేది వాస్తవం.