అసలే వరుస ఫ్లాప్‌లలో ఉన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈమధ్య తాను వోడ్కామానేస్తున్నానని, ఇకపై పెద్దగా వివాదాస్పద ట్వీట్లు చేయనని మాటిచ్చాడు. కానీ మరలా అదే దోరణిలో ట్వీట్లు లాగించేస్తున్నాడు. ఇక ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ 'సర్కార్3'కి ముంబై హైకోర్టు పెద్ద షాక్‌నే ఇచ్చింది.
ఇక ఆమధ్య ఆయన తాను త్వరలోనే ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా 'న్యూక్లియర్'ని హాలీవుడ్‌స్థాయిలో తీస్తానన్నాడు. ఈ చిత్రం తర్వాత వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి చిన్నమ్మ 'శశికళ'పై కూడా మూవీ తీస్తానన్నాడు. ఇక ఆయన తాజాగా మరో వివాదకరమైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శేఖర్‌కపూర్ ప్రపంచ సినిమాను సరికొత్త పుంతలు తొక్కించిన రియల్ అండ్ రీల్ హీరో బ్రూస్‌లీ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం చేస్తున్నానని చెప్పి, ప్రస్తుతం బ్రూస్‌లీ కుమార్తె సాయంతో స్క్రిప్ట్‌ను తుదిదశకు తీసుకొచ్చాడు. ఇంతలో వర్మ మరలా కెలికాడు.
తనకు బ్రూస్‌లీ ఆరాధ్యదైవమని, కాబట్టి శేఖర్‌కపూర్ చిత్రం విడుదలయ్యే సమయానికే తాను కూడా బ్రూస్‌లీ జీవితంపై ఓ చిత్రం తీసి, శేఖర్‌కపూర్ చిత్రం విడుదలయ్యే సమయంలోనే రిలీజ్ చేస్తానంటున్నాడు. వీటిని చూస్తే వర్మ ఇంకా వోడ్కా మానలేదనిపిస్తోంది.