Advertisementt

రజినీకాంత్ లుక్ అదిరిపోలా...!

Thu 11th May 2017 12:21 PM
thalaivar rajinikanth,director pa ranjith,dhanush,rajini166,rajinikanth new film look  రజినీకాంత్ లుక్ అదిరిపోలా...!
Rajinikanth and Ranjith Pa Movie Look రజినీకాంత్ లుక్ అదిరిపోలా...!
Advertisement
Ads by CJ

సౌత్ లో రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే స్టార్ హీరోకి లేదు. సూపర్ స్టార్ నటించిన సినిమాలు ఎన్ని ప్లాపయినప్పటికీ ఆ ఛాయలు ఆయన నటించే సినిమాల మీద అస్సలు పడవు. గతంలో ఆయన నటించిన రోబో చిత్రం తప్ప ఆయనకు మధ్యలో హిట్ అనే పదం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు కబాలి ప్లాపు తర్వాత రజినీకాంత్.. శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రం 2 .0  చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే జనవరిలో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

ఇక రోబో 2 .0  తర్వాత రజినీకాంత్, రంజిత్ పా డైరెక్షన్ లో మరోమారు నటించబోతున్నాడు. మరి ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన కబాలి చిత్రం ఆశించిన రీతిలో విజయం సాధించలేదనే విషయం తెలిసిందే. అయినా వీరి కాంబినేషన్ లో మరో మూవీ సెట్స్ మీదకి రాబోతుంది అంటే ఆ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రంజిత్ త‌న‌దైన శైలి టేకింగ్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌న్న న‌మ్మ‌కం త‌లైవా అభిమానుల‌కు ఉండబట్టే అంచనాలు భారీగా ఉన్నాయని అంటున్నారు. 

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి సంబందించిన ఒక లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆ లుక్ లో తలైవా ప‌క్కా.. మాస్‌ని టార్గెట్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. కింద లుంగీ - పైన బ‌నియ‌న్‌తో రజిని అదరగొట్టేస్తున్నాడు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న  త‌లైవార్ 161 టైటిల్‌తో రిలీజైన‌ ఈ న్యూ లుక్ చూసి రజిని ఫ్యాన్స్ ని ఆపడానికి అవధుల్లేవంటే నమ్మండి. 

Rajinikanth and Ranjith Pa Movie Look:

Thalaivar Rajinikanth is once again collaborating with director Pa Ranjith for actor Dhanush's home production venture.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ