మొన్నామధ్యన కోలీవుడ్, టాలీవుడ్ లలో సింగర్ సుచిత్ర రూపంలో వచ్చిన సుచి లీక్స్ ఎంతటి సంచలనాలకు తెర తీశాయో అందరికి తెలిసిందే. సుచి లీక్స్ వలన బడా హీరోహీరోయిన్స్ పరువులుపోయి టెన్షన్ పడ్డారు. అప్పట్లో ఆ లీకులు కోలీవుడ్ హీరోహీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. సుచి లీక్స్ మేటర్ కోలీవుడ్ లో ఇటూ టాలీవుడ్ లో రచ్చ చేసిన విషయం మరవకముందే మళ్ళీ ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 స్టార్ట్ అవుతుందనే ప్రచారం మొదలైంది. మరి సుచి లీక్స్ కే భయపడి చచ్చిన కొంతమంది ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 అంటే హడలి చచ్చిపోతున్నారు.
మళ్ళీ సుచి లీక్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో అని టెన్షన్ తో చమటలు పట్టేస్తున్నాయట. అసలు ఆ లీక్స్ ని ఎవరు బయటపెట్టారో కూడా ఇంతవరకు నిజానిజాలను పోలీస్ లు కనిపెట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 అంటూ మరో గాలి వార్త అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సుచి లీక్స్ వలన బాధింపపడ్డ ధనుష్, త్రిష, అనిరుద్, రాణా, అబ్బో ఆ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. అప్పట్లో బయటపడ్డ నగ్న చిత్రాలు, వీడియోల్ని చూసి బిక్కచచ్చిపోయి కిక్కురుమనకుండా ఉండిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ అదే పొజిషన్ లోకి వెళ్లిపోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
మరి సుచిత్రకి మానసిక వ్యాధి ఉన్నట్లు... ఆమెను బాగుచేయించడం కోసం అమెరికా తీసుకెళ్లినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అదిగో అప్పటినుండి మళ్ళీ సుచిత్ర గురించి ఇప్పటివరకు న్యూస్ లేదు. మళ్ళీ ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 అంటూ ప్రచారం అయితే జోరుగా మొదలైంది.