ఎన్టీఆర్.. ముందు నుండి హిట్ దర్శకుల వెంటపడి వారితో సినిమాలు చేసేవాడు. అయితే అలా ఎన్టీఆర్ వెంటపడిన ప్రతిసారి ఆ సినిమాలు మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా ఎన్టీఆర్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ మైండ్ సెట్ లో కొంచెం మార్పొచ్చినట్లు కనబడుతుంది. అందుకే 'టెంపర్' చిత్రం నుండి హిట్ ట్రాక్ పట్టాడు. అయితే ఎన్టీఆర్ కి ఎప్పటినుండో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలనే కోరిక బలంగా ఉండేది. అది ఎట్టకేలకు ఇప్పుడు తీరబోతుంది. ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాని సెట్ చేసాడు ఎన్టీఆర్. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ హీరోగా చేస్తున్న చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టేస్తాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ మీదకెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాశాడని అంటున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల ప్రస్తుతం మహేష్ బాబుతో చెయ్యబోయే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ఇక మహేష్ తో సినిమా కంప్లీట్ కాగానే కొరటాల మరలా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇక కొరటాల అలా అనుకున్నాడో లేదో ఇలా ఎన్టీఆర్ ని కలవడమూ... ఎన్టీఆర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడమూ... ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేవరకు కాస్త అనుమానమే మరి ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది.
ఒకవేళ ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే గనక అంచనాలు మాత్రం తారా స్థాయిలో ఉండడం మాత్రం నిజం. ఇప్పటికే కొరటాల తీసిన మూడు చిత్రాలు హిట్ అవడం... ఇక మహేష్ తో తీసే 'భరత్ అను నేను' కూడా హిట్ అయితే కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం మీద అంచనాలు మాములుగా వుండవు.