ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా నడుస్తోంది. పాలనలో ఎన్ని లోపాలున్నా, విపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తాము కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా ఓ సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది.
ఇక కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్‌రావు వంటి వారికి తెలంగాణలో మంచి పేరుందని, కాబోయే సీఎం కేటీఆర్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరు మంచి హార్డ్ వర్కర్లే కాకుండా మంచి పరిపాలనాధ్యక్షులుగా కూడా నిరూపించుకుంటున్నారు. కానీ ఈ తాజా సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగుజూసింది. కేసీఆర్ తర్వాత తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డిని అత్యధికులు సీఎంగా చూడాలని భావిస్తుండటం విశేషం.
ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పలువురు భావిస్తూ వచ్చారు. కానీ ఈ సర్వే అలాంటిదేమీ లేదని తేల్చింది. టీఆర్‌ఎస్ తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్, నెక్ట్స్ టిడిపి, తర్వాత బిజెపికి మద్దతు తెలిపారు. ఇక రేవంత్‌తో పోల్చుకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, లక్ష్మన్‌లు కూడా వ్యక్తిగత ఫాలోయింగ్ విషయంలో చాలా వెనుకబడి ఉండటం విశేషం.