పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తుండగా మరో సీనియర్ నటి ఖుష్బూ కీ రోల్ పోషిస్తుంది. అయితే ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ కుర్రాడిగా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా... ఈ సినిమా టైటిల్ కూడా 'ఇంజనీర్ బాబు' అంటూ ఫిక్స్ చేసేశారు పవన్ ఫ్యాన్స్. దాదాపు ఇదే టైటిల్ పవన్ సినిమాకి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ టైటిల్ పై చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే 'ఇంజినీర్ బాబు' అనే టైటిల్ కి ముందే ఈ చిత్రానికి నాలుగైదు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. 'దేవుడే దిగివస్తే, మాధవుడు' అంటూ రకరకాల టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. పవన్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ 'గోకుల కృష్ణుడు' అంటూ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. ఇక ఇదే టైటిల్ ని పవన్ సినిమాకి ఫిక్స్ అంటూ అప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా రెడీ చేసేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. 'ఇంజినీర్ బాబు' విషయంలో కూడా ఇలాగే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని తయారు చేసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పట్లో త్రివిక్రమ్ -పవన్ సినిమాకి టైటిల్ అంటూ ఏం చర్చించడంలేదని చిత్ర యూనిట్ తెలుపుతుంది. చూద్దాం టైటిల్ పెట్టేలోపు ఇంకెన్ని టైటిల్స్ నెట్ లో హల్చల్ చేస్తాయో...!