శర్వానంద్ ఈ నెల 12 న 'రాధా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అసలు ఈ సినిమా మార్చి లోనే విడుదల కావాల్సి ఉండగా మార్చి, ఏప్రిల్ పెద్ద సినిమాల హడావిడి ఎక్కువగా ఉండడంతో నిర్మాతలు ఈ సినిమా ని మే కి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా బాహుబలి అనే సునామి బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతుంది. అయినా నిర్మాతలు శర్వానంద్ కూడా ధైర్యం చేసి బరిలోకి దిగుతున్నారు. అయినా శర్వాతో సినిమాలు నిర్మించే నిర్మాతలకు కొంచెం ధైర్యం ఎక్కువనే చెప్పాలి.
ఎందుకంటే శర్వానంద్ ఒకప్పుడు చిన్న చితక సినిమాల్లో నటించినా కూడా కొంతకాలం నుండి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి హిట్ కొట్టేస్తున్నాడు. అది కూడా పెద్ద పెద్ద స్టార్స్ కి ఎదురెళ్లి మరీ హిట్స్ కొడుతున్నాడు. గత ఏడాది సంక్రాతి బరిలో 'నాన్నకు ప్రేమతో డిక్టేటర్' వంటి పెద్ద చిత్రాలతో 'ఎక్ష్ప్రెస్స్ రాజా' చిత్రంతో శర్వా ఢీ కొట్టి గెలిచాడు. అలాగే మొన్న సంక్రాంతికి కూడా 'ఖైదీ నెంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి భారీ చిత్రాల నడుమ 'శతమానం భవతి' చిత్రంతో బరిలోకి దిగి సూపర్ హిట్ కొట్టాడు.
మరి శర్వా కి ఆయన సినిమా నిర్మాతలకు ఎంత ధైర్యం ఉంటె ఇలా చేస్తారు. అంటే వారికి వారి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతె ఇలాంటి ధైర్యం చేస్తారు. ఇక ఇప్పుడు కూడా బాహుబలి అనే కొండను ఢీ కొట్టడానికి రెడీ అయిన 'రాధా' చిత్రం కూడా కాస్త కామెడీ, కాస్త ఎమోషన్, కాస్త యాక్షన్ కలిపి ఉండే కథలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత, హీరో శర్వా కి ఎంత గట్టి నమ్మకం లేకపోతె బాహుబలి బాక్సాఫీస్ కి ఎదురు నిలబడతారు. ఎంతైనా వీరి ధైర్యం చూస్తుంటే మాత్రం ఈ సారి కూడా శర్వా 'రాధా' తో ఖచ్చితంగా హిట్ కొడతాడని అనిపిస్తుంది.