Advertisementt

అందుకే జగపతిబాబు ఈజ్‌ గ్రేట్‌...!

Tue 09th May 2017 07:09 PM
jagapathi babu,heroines,ramya krishna,priyamani,trisha,shruti haasan  అందుకే జగపతిబాబు ఈజ్‌ గ్రేట్‌...!
Jagapathi Babu Comments about Heroines..! అందుకే జగపతిబాబు ఈజ్‌ గ్రేట్‌...!
Advertisement
Ads by CJ

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో... లేడీస్‌ ఫాలోయింగ్‌లో ఏయన్నార్‌, శోభన్‌బాబు, నాగార్జునల తర్వాతి స్థానం ఎవరు అవునన్నా... ఎవరు కాదన్నా జగపతిబాబుదే. ఇక ఫ్యామిలీ హీరోగా, మాస్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు విలన్‌గా కూడా ఆయన రాణిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఆయన తన జీవితంలో హీరోయిన్ల విషయంలో స్పష్టంగా వ్యాఖ్యలు చేశాడు. శృతిహాసన్‌ మల్టీటాలెంటెడ్‌. తను నా సిస్టర్‌ వంటిది అని తెలిపాడు. 

ఇక నేను ఎవరికైనా లవ్‌ప్రపోజ్‌ చేస్తే మొదటి సారే ఒకే చెప్పేవారు. అంగీకరించేవారు అన్నాడు. ప్రియమణి నాకు లవర్‌ వంటిది. త్రిష హాట్‌. మమతామోహనదాస్‌ ఓ ఫ్రెండ్‌. రమ్యకృష్ణ ఈజ్‌ మై డార్లింగ్‌. నిన్నటి తరాన్నే కాకుండా నేటి తరాన్ని కూడా రమ్యకృష్ణ అలరిస్తూ తన అందాన్ని గ్లామర్‌ని కాపాడుకుంటోందని ప్రశంసలు కురిపించాడు. ఇక సౌందర్య అన్నా, ఆమె సోదరుడన్నా నాకు ఎంతో అభిమానం. ఆమె మరణవార్త నాకు విదేశాలలో నా భార్యతో కలిసి, మసాలా దోశ తింటున్నప్పుడు తెలిసింది. 

చాలా బాధపడ్డానని తెలిపాడు. నేను ఇష్టపడిన ఓ అమ్మాయిని మా అమ్మగారు ఒప్పుకోలేదు. దాంతో నా లవ్‌, మ్యారేజ్‌లు ఆమెతో జరగలేదు అని చెప్పుకొచ్చాడు. 'అంత:పురం'లో పాత్రను నా అభిమానులు ఒప్పుకోలేదు. కానీ ఒప్పించాను. స్వయంగా ఇండియన్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ కూడా చనిపోయే సన్నివేశంలో నేను అద్భుతంగా నటించానని పొగిడాడు. ఈ పొగడ్త నాజీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. మొత్తానికి జగ్గూభాయ్‌ తన మనసులోని విషయాలను బయటపెట్టి తాను ఓపెన్‌ పర్సన్‌, అండ్‌ బోల్డ్‌ పర్సన్‌ అని నిరూపించుకున్నాడు. 

Jagapathi Babu Comments about Heroines..!:

To speak of existence ... Ladies following after ANR, Shobhan Babu and Nagarjuna after Jagapathi babu this true. Recently, he made clear comments about heroines in his life. Priyamani is like a lover. Trisha Hot. Mamata Mohandas is a friend. Ramakrishna is my darling. Ramaykrishna excited to save his glamor, not just yesterday, but also today's generation.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ