తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఈవోగా ఉత్తరాది ఐఏయస్ ఆఫీసర్ అశోక్‌కుమార్ సింఘాల్ నియామకంపై వాదోపవాదాలు ఘాటుగా సాగుతున్నాయి. పవన్ మాట్లాడుతూ, తాను ఉత్తరాదికి వ్యతిరేకిని కాదని, కానీ దక్షిణాది వారికి ఉత్తరాదిలో ఇలాంటి కీలకమైన పదవిని ఇస్తారా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మండిపడ్డారు.
ఇంకా ఉత్తరాది, దక్షిణాది అనే మాట మాట్లాడవద్దు, మంచి పని చేయగలిగిన సత్తా ఉంటే అంతకంటే మనకేం కావాలి.. సింఘాల్ బాగా పనిచేయగలడు. గత ఎన్నికల్లో పవన్ తమకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆయన ఏం పడితే అది మాట్లాడితే మేము పడాలా? కేంద్రంలో చక్రం తిప్పుతున్న వెంకయ్య నాయుడు దక్షిణీయుడు కాదా? నేషనల్ ఫ్రెంట్ పెట్టి దేశరాజకీయాలను శాసించిన ఎన్టీఆర్ దక్షిణాది వాడు కాదా? సింఘాల్ సరిగ్గా పనిచేయకపోతే ఆయన్ను తొలగించే హక్కు మనకుంది. కాబట్టి సెన్స్ లేకుండా మాట్లాడవద్దని విరుచుకుపడ్డాడు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఏపీకి చెందిన వీరయ్య చౌదరి పదవిని నిర్వహించడం లేదా? ఇకనైనా దక్షిణాది, ఉత్తరాది అని మాట్లాడవద్దని దాదాపు పవన్‌ని హెచ్చరించే ధోరణిలో అన్నాడు.
సరే.. పవన్ మాటలకు కౌంటర్ ఇచ్చావు. కానీ ఉత్తరాది వారికి ఆగమశాస్త్రం తెలియదని, దేవాలయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆగమ నియమాలు తెలిసి ఉండాలని స్వామి స్వరూపానంద ప్రశ్నకి ఏమి చెబుతావు వర్ల రామయ్యా..! నిన్ను కూడా కేంద్రంలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ని చేస్తానని బాబు హామీ ఇచ్చాడా? ఏమిటి? అనే సందేహాలు కలుగకమానవు.