మన నిర్మాతలు హీరోల స్టామినాలను చూడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాలు నిర్మిస్తూ నష్టపోతున్నారు. మరోవైపు బయ్యర్లు, శాటిలైట్ ఛానెల్స్ వారు కూడా చిన్న సినిమాలను వదిలి.. ఎండమావి వంటి పెద్ద చిత్రాల వైపు దౌడ్ తీస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో 'సింహా,లెజెండ్' వంటి చిత్రాలు బాలకృష్ణకు పెద్ద హిట్స్‌ని అందించాయి. కానీ ఆయా చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు కొన్నప్పటికీ ఆయా చానెల్స్‌కు ఆ చిత్రాల ప్రదర్శన వల్ల వచ్చిన ఆదాయం తక్కువే.
ఇక బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా వారియర్ చిత్రాలు, చారిత్రక చిత్రాలను బాగా ఆదరిస్తారు. చిన్నపిల్లలు బాగా ఇష్టపడే ఈ చిత్రాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. కాగా బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు ధియేటర్లలో మంచి హిట్టుగానే నిలిచింది. కాగా ప్రస్తుతం బాలయ్య, వరుస ఫ్లాప్‌లలో ఉన్న పూరీజగన్నాథ్‌తో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న భవ్య ఆర్ట్స్ బేనర్ నుంచి ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఓ చానెల్ 9కోట్లకు కొనుగోలు చేసిందట. ఎంతైనా ఆ ఛానెల్ వారు ఈ చిత్రంపై ఎక్కువ మొత్తాన్నే పెట్టారని చెప్పవచ్చు.
మరోవైపు అల్లుఅర్జున్‌కు బాలీవుడ్‌లో మార్కెట్ లేదు. కానీ తాజాగా ఆయన నటిస్తున్న 'డిజె' చిత్రాన్ని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే ఉద్దేశ్యం లేనప్పటికీ కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 7కోట్లు వెచ్చించారట. ఇది తెలుగు సినిమాకు గర్వకారణమే అయినా బాలీవుడ్ లో అల్లు అర్జున్ మార్కెట్ ఏంటి అనేది ఆలోచించకుండా ఇలా కొనడం, రేపు చిత్ర రిజల్ట్ తేడా వస్తే..టెంట్ లు వేసుకుని కూర్చోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.