Advertisementt

పవన్‌ గురించిన నిజాలు చెప్పిన దర్శకుడు..!

Tue 09th May 2017 04:48 PM
pawan kalyan,director arun prasad,arun prasad told about pawan  పవన్‌ గురించిన నిజాలు చెప్పిన దర్శకుడు..!
Director Told the Truth about Pawan పవన్‌ గురించిన నిజాలు చెప్పిన దర్శకుడు..!
Advertisement

పవన్‌తో 'తమ్ముడు' చిత్రం తీసి పెద్ద సక్సెస్‌ కొట్టిన దర్శకుడు అరుణ్‌ప్రసాద్‌ ఆ తర్వాత కనుమరుగయ్యాడు. తాజాగా ఆయన పవన్‌ గురించి పలు నిజాలు చెప్పుకొచ్చాడు. పవన్‌ భలే సిగ్గరి. తనకు తెలియని వారు సెట్స్‌లో ఉంటే సెట్స్‌లోకి కూడా రాలేడు. తనకు బాగా క్లోజైన ఎవరిచేతినైనా పట్టుకుని సెట్స్‌లోకి వచ్చేవాడు. ఇక ఆయన రొమాంటిక్‌ సీన్స్‌ చేసేందుకు హడలిపోయేవాడు. 

'తొలిప్రేమ, తమ్ముడు, బద్రి'.. వంటి చిత్రాలను ఆయన కొత్త దర్శకుల్లో పెద్ద పెద్ద హిట్స్‌ కొట్టాడు. 'ఖుషీ' వరకు ఆయన జడ్జిమెంట్‌ భలే ఉండేది. ఫలానా షాట్‌ని ఇలా చేద్దాం అని సలహా ఇచ్చాడంటే ఆ సీన్‌ థియేటర్లలో అదిరిపోయేది. అంత గొప్పగా ఆయన జడ్జిమెంట్‌ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆయన ఒకప్పుడు మాతో పాటు కిందకూర్చొని తినేవాడు. 

అసిస్టెంట్‌ డైరెక్టర్లు కూడా ఆయన్ను 'నువ్వు..నువ్వు' అనే పిలిచేవారు. కానీ ప్రస్తుతం కొందరి వల్ల బిల్డప్‌ మార్చి  కిలోమీటర్‌ దూరంలో ఉండి 'బాబు..బాబు' అనిపించుకుంటున్నాడనిపిస్తోంది. ఆయన చుట్టూ అలాంటి వారు తయారయ్యారేమో చెప్పలేను. ఇక ఆయనంటే తమిళ స్టార్స్‌ విజయ్‌, అజిత్‌, విక్రమ్‌, సూర్య వంటి వారికి భలే ఇష్టం. ఎప్పుడైనా చెన్నై నుంచి నేను పవన్‌కి ఫోన్‌ చేస్తే పవన్‌ వాయిస్‌ వినాలని విజయ్‌ బలవంతంగా స్పీకర్‌ ఆన్‌ చేయించేవాడు. 

అప్పటికే విజయ్‌ పవన్‌ కంటే 3,4రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునే వాడు. కానీ ఆయన పవన్‌ అంటే చిన్నపిల్లాడిలా ఎగ్జెట్‌ అయ్యేవాడు. నాఉద్ధేశ్యంలో పవన్‌ పాలిటిక్స్‌కి పనికిరాడు. ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవడం మంచిది. రాజకీయాలలో ఫిజికల్‌ ఫైట్‌ కంటే ఓరల్‌ ఫైట్‌ ముఖ్యం. పవన్‌కి అది చేత కాదు. ఎవరైనా ఒరేయ్‌.. అన్నా కూడా 'మీరు' అని సంబోదిస్తాడు. పాలిటిక్స్‌లోకి వస్తే పొల్యూట్‌ కావాలి. అది చేతగాకపోతే కష్టం. పవన్‌కి అది చేతకాదు. ఆయన ఫ్యాన్స్‌ వల్లే రాజకీయాలలోకి వచ్చినట్లు కనిపిస్తోంది.. అంటూ చెప్పుకొచ్చాడు. 

Director Told the Truth about Pawan:

Director Arun Prasad was later disappeared after he had a big success with Pawan film is 'thammudu'. Recently Arun Prasad Told truths about Pawan.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement