జగన్ ఒక అహంభావి అని, ఆయన ఎవ్వరి మాటా వినడని, ఎవరిని, ఏ సీనియర్‌ను కూడా లెక్కపెట్టడని, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా నిలబెట్టే మాట్లాడుతాడనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. మంచి వ్యూహకర్తలైన ఎం.వి. మైసూరారెడ్డి, కొణతాల, తనకు ఫ్రాణం ఇచ్చిన కొండా సురేఖ వంటి ఎందరినో దూరం చేసుకున్నాడని, ఆ పార్టీని మారిన వారు అందరూ దాదాపు ఇదే మాట చెప్పారని అంటుంటారు.
ఇక ఆయన మంచి లోతైన విశ్లేషకులను కాకుండా తమ మాటలతో చంద్రబాబుని విమర్శించే రోజా, అంబటి రాంబాబు వంటి వారికి ఆయన పెద్ద పీట వేస్తాడని, ఆయన్ను మెప్పించాలంటే వ్యక్తిగత ఆరాధన, స్వీయభజన ముఖ్యమంటారు. తాజాగా ఆయన తన సొంత పార్టీకి చెందిన పలువురిని తీవ్రంగా అవమానించాడని తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నవారిని కూడా ఆయన తన మాటలతో బాధపెట్టాడట.
మాట్లాడటం, స్వంత నియోజకవర్గాలను అభివృద్ది చేయడం, కౌంటర్లు వేయడం ఎలా? అనే విషయాలను రోజాను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పడంతో ఆయన పార్టీలోని పలువురు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని, తాము రోజాలాగా నిసిగ్గుగా విమర్శలు చేయలేమని, రోజా స్వంత నియోజకవర్గమైన నగరికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటే రోజాకు అక్కడున్న మంచి పేరు ఏమిటో తెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.