బాహుబలి చిత్రం విడుదలై 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసి 1500 కోట్ల క్లబ్ ని సృష్టించడానికి రెడీగా వుంది. ఇక బాహుబలి సినిమాని వీక్షించిన వారంతా ఒక్కొక్కరిగా రాజమౌళికి బాహుబలి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బాహుబలి విడుదలైన రోజే చూసిన తారక్, జక్కన్నా నువ్వు సూపర్ అంటూ రాజమౌళిని పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజమౌళి అండ్ టీమ్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక నిన్నటికి నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా బాహుబలి 1000 కోట్ల మార్కుని అందుకోవడం తెలుగు వారు గర్వించదగిన విషయంగా కొనియాడారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి రైటర్ గా పేరున్న కోన వెంకట్ కూడా బాహుబలి చూసిన తర్వాత ఈ సినిమా రేర్ ఫీట్ సాధించింది. ఇంత గొప్పగా సినిమా తెరకెక్కించిన రాజమౌళిని ప్రతి ఒక్కరూ అప్రిషెట్ చెయ్యాలి.... అని ఈ విషయంలో ఎన్టీఆర్, పవన్, మహేష్ లు స్పందించడం చాలా గొప్ప విషయం...... కానీ ఇంతమంది బాహుబలి ద కంక్లూజన్ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే బాలీవుడ్ ఖాన్స్ త్రయం మాత్రం ఇప్పటికి సైలెంట్ గానే వున్నారని వారి మీద సెటైర్ వేశాడు.