Advertisementt

చిరుకి జోడిగా ఎవరు ఫైనలో..?

Mon 08th May 2017 05:10 PM
chiranjeevi,ram charan,director surender reddy,uyyalawada narasimha reddy,aishwarya raai,vidya balan  చిరుకి జోడిగా ఎవరు ఫైనలో..?
Chiranjeevi Ready for Uyyalawada చిరుకి జోడిగా ఎవరు ఫైనలో..?
Advertisement
Ads by CJ

చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ...' వచ్చి అప్పుడే నాలుగు నెలలు గడిచిపోతుంది. తన తదుపరి ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి' చిత్రాన్ని చేస్తానని చెప్పిన చిరు ఇప్పుడిప్పుడే ఆ సినిమాను పట్టాలెక్కించి పనిలో పడ్డాడు. ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే ఫినిష్ చేశారని అంటున్నారు. అయితే ఉయ్యాలవాడ నిజ జీవితంలో తన అనుచరుడి వలన బ్రిటిష్ వారికీ దొరికిపోయి చంపబడతాడు. అయితే సేమ్ ఇలాగే వీరపాండ్య కట్టబొమ్మన జీవితంలో కూడా తన అనుచరుడి కుట్ర వల్లే వీరపాండ్య కట్టబొమ్మన కూడా ప్రాణాలు కోల్పోతాడు. అందుకే వీరపాండ్య కట్టబొమ్మన కథకు ఉయ్యాలవాడ కథకు ఎక్కువ పోలికలుండడంతో.... ఉయ్యాలవాడపై వీరపాండ్య వాసనలు రాకుండా పరుచూరి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారట.

మరోపక్క చిరంజీవికి జోడిగా ఇంకా హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు. మొన్నామధ్యన పొడుగుకాళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ చిరుకి జోడిగా ఉయ్యాలవాడలో నటిస్తుందని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఐష్ ని ఇంకా ఫైనల్ చెయ్యలేదని డైరెక్టర్ సురేందర్ రెడ్డి మనసులో మరో బాలీవుడ్ భామ కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సురేందర్ రెడ్డి మదిలో చిరు పక్కన హీరోయిన్ గా విద్యాబాలన్ కూడా ఉందట. అందుకే వీరిద్దరిలో ఫైనల్ గా ఎవర్ని సెలెక్ట్ చెయ్యాలో సురేందర్ రెడ్డికి ఇంకా క్లారిటీ రాలేదట. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఆగష్టు లో సెట్స్ మీదకి తీసుకెళ్లే యోచనలో నిర్మాత, డైరెక్టర్ ఉన్నట్లు చెబుతున్నారు.

Chiranjeevi Ready for Uyyalawada:

Chiranjeevi's 150th film 'prisoner ...' comes just four months.  His next project, Surender Reddy, was Directing to the movie 'Uyyalavada Narasimha Reddy' in the direction of the film when he was working on the film. On the other side, Chiranjeevi is opposite heroine is not final. The producer and director say that the film is going to take on sets in August.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ