Advertisementt

ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా..!

Mon 08th May 2017 04:16 PM
prabhas,radha krishna,baahubali,saaho,next prabhas movie,1000 crores crosses  ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా..!
Prabhas and Radhakrishna's Film Soon ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా..!
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఇప్పుడు బాహుబలి మ్యానియా నుండి  బయట పడడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు. దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే టైమ్ మొత్తం కేటాయించాడు. ఇక ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ప్రభాస్ తదుపరి చిత్రాల మీద బాహుబలి ఛాయలు కూడా పడకూడదు. ఒకవేళ పడింది అంటే ఆ సినిమా బాహుబలికి మించిన ప్రాజెక్ట్ అయ్యుండాలి. అందుకే ఇప్పుడు ప్రభాస్ యువి క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో సుజిత్ దర్శకుడిగా భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' లో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సుజిత్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ లో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు.

ఇప్పటికే ప్రతిసారి బాహుబలి లాంటి చిత్రాలు చెయ్యాలంటే కుదరదు... అలంటి చిత్రాలనే నమ్ముకుని కూర్చోకూడదు.... వచ్చినప్పుడు మాత్రమే అలాంటి చిత్రాల్లో నటించాలని చెబుతున్న ప్రభాస్ తన తదుపరి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి కూడా హింట్ ఇచ్చేస్తున్నాడు. తాను ఇక నటించబోయే చిత్రాలలో రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా మిళితమై ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు. బాహుబలి చిత్రం చేయకముందు నుండే హిట్ ట్రాక్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు సరైన సినిమాలను ఎంచుకుంటూపోతే టాలీవుడ్ నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కుంచుకోవడం పెద్ద విషయం కాదు.

బాహుబలితో 1000  కోట్ల క్లబ్బుని ఓపెన్ చేసిన ప్రభాస్ రేంజ్ మాములుగా లేదు. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోస్ అంతా 100  కోట్ల క్లబ్బుని అందుకోవడానికి నానా తంటాలు పడుతుంటే ప్రభాస్ మాత్రం బాహుబలితో 1000  కోట్ల క్లబ్బులో కూర్చుని ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మరి ఆ రేంజ్ ని అందుకోవడం మాత్రం టాలీవుడ్ హీరోలకు ఇప్పట్లో అయ్యేపని కాదు.

Prabhas and Radhakrishna's Film Soon:

'Hey everyone!! I am so very happy to announce my next movie with our very own Bahubali Prabhas. Hope to show the darling side of this Bahubali!! A pure Love story, on its way', tweeted Radhakrishna.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ