ఓ స్టార్ హీరోగా పవన్ తన సినిమాల కథలు, దర్శకుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఎప్పటి నుంచో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మూడే దారులు వెత్తుకుంటున్నాడు. వీలుంటే ఓ కప్పు కాఫీ.. కాసిన్ని మాటలు టైప్‌లో.. వీలుంటే ఓ రీమేక్, లేకపోతే తన స్వంత కథలు, మరీ కాదంటే త్రివిక్రమ్‌తో సినిమా మినహా ఆయన దర్శకుల విషయంలో కూడా పలు ఘాటైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
స్టోరీలను, సరైన దర్శకులను ఎంచుకోవడంలో తప్పులు చేస్తూ సామాన్య ప్రేక్షకులనే కాదు.. వీరాభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కాగా పవన్‌పై ఇప్పుడు ఓ పంచ్ పేలింది. 'బాహుబలి, భజరంగీ భాయిజాన్, మణికర్ణిక' వంటిచిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ ప్రశ్నకు సమాధానంగా తనకు పవన్ అంటే నటునిగా చాలా ఇష్టమన్నాడు. ఇక ఆయన తన సొంతకథలు చేయకుండా ఉంటే ఇంకా ఇష్టమని చెప్పాడు. పవన్ జనసేనకు ఆల్‌దిబెస్ట్ అన్నాడు.
ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్నందు వల్ల ప్రభాసే తన ఫేవరేట్ హీరో అని తెలివిగా సమాధానం ఇచ్చాడు. నిజంగానే విజయేంద్రప్రసాద్ పవన్ సొంత కథల విషయంలో చెప్పింది అక్షరసత్యం.