బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక చిత్రం ప్రారంభమై షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అసలు వీరి కాంబినేషన్లో ఒక మూవీ స్టార్ అవడమే ఒక సెన్సేషన్ అయితే ఆ సినిమాని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చెయ్యాలని పూరి జగన్నాధ్ భావిస్తున్నాడు. అందుకే విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఇక బాలకృష కూడా ఎంతో ఉత్సాహంగా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకోవడంతో పాటు ఒక కోటి ఖర్చుతో పాటని కూడా కంప్లీట్ చేసేశారు.
ఇక మూడో షెడ్యూల్ కోసం పూరి అండ్ టీమ్ పోర్చుగల్ కి పయనం కాబోతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు మూడు పాటలను కూడా పోర్చుగల్ లో షూట్ చేస్తారట. 40 రోజుల పాటు ఏకధాటిగా ఈ షూటింగ్ అయిపోయాక జూన్ నెలాఖరున 10 రోజుల ఆఖరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. మరి ఇంత త్వరగా షూటింగ్ చెయ్యకపోతే అనుకున్న టైమ్ కి రావడం కష్టం కదా.. అందుకే ఇలా బాలయ్య - పూరీలు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29 దసరా కి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.