భారతదేశం ఈ కులాల, మతాల కంపులో, రాజకీయనాయకుల, వైట్‌కాలర్ మోసగాళ్లు, బడా పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్ల మోసాలతో ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది. నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే..చండాలుడుండేటి సరిభూమి ఒక్కటేనని ఆనాడే అన్నమయ్య చెప్పారు. ఇక ఈ దేశం ఈ మాత్రమైన ఉన్నదంటే అది పోలీసులు, రాజకీయనాయకులు, ఐఏయస్‌ల వల్ల కాదు.
కేవలం వీరజవాన్లు, కిసాన్లు, న్యాయస్థానాల వల్లే. ఇప్పటికీ ఏదైనా కాస్త నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థ ఏమైనా ఉందంటే అది న్యాయవ్యవస్థ మాత్రమే. కానీ మన పాలకులు జడ్జిల నియామకం నుంచి రాజకీయాలకు, కులాలకు పెద్దపీట వేసి దానిని కూడా గొంతునొక్కాలని చూస్తున్నారు. న్యాయమూర్తుల కొరత కారణంగా కేసులు ఏళ్లకు ఏళ్లు సాగుతూ న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. కానీ నిజం అది కాదు. కావాలనే పాలకులు జడ్జిల కొరతను సృష్టిస్తూ న్యాయస్థానాలపై కూడా ప్రజల్లో నమ్మకం పోయేలా చేస్తున్నారు. నిజంగా దేశానికి. పెడింగ్ ఫైల్స్ లేకుండా సత్వర తీర్పు వచ్చేలా చూసేందుకు తగ్గ న్యాయమూర్తులను నియమించి, వారి నియామకంపై ఒత్తిడి లేకుండా స్వేచ్చనిస్తే న్యాయస్థానాలు నేరస్థులకు చుక్కలు చూపిస్తాయి.
జయలలిత, శశికళ కేసులో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన ఘనత కోర్టులదే. సత్యంబాబు కేసు నుంచి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. దేశంలో ఉమ్మడికుటుంబ వ్యవస్థ నాశనం అవుతోంది. కోడలు కూడా కాబోయే అత్తగారే అని మరిచి, కొత్తగా వచ్చిన బార్యలు భర్త నుండి అత్తమామలను దూరం చేస్తూ మగవారికి నరకం చూపిస్తున్నారు. దీంతో వయోవృద్దులైన తల్లిదండ్రుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. పెళ్లయిన తర్వాత కూడా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తనయులపై ఉందని, దానిని వ్యతిరేకిస్తే పెళ్లాలకు మొగుళ్లు విడాకులు ఇవ్వడం కూడా సబబేనని వ్యాఖ్యానించింది. దీనిపై చట్టం చేయాలంది.. అద్భుతమైన తీర్పు ఇది.