Advertisementt

బలహీనుల పైనే మీ ప్రతాపమా...?

Sat 06th May 2017 03:46 PM
telangan police,kcr,narendra modi,digvijaya singh  బలహీనుల పైనే మీ ప్రతాపమా...?
Digvijaya Singh Comments on the Telangana Police! బలహీనుల పైనే మీ ప్రతాపమా...?
Advertisement
Ads by CJ

దేశంలోని పాలకుల్లో అసహనం పెరిగిపోతోంది. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా గొంతు నొక్కేస్తున్నారు. వారి వాయిస్‌ వినిపించకుండా చేస్తున్నారు. మీడియా నేడు భ్రష్టు పట్టి ఉండవచ్చు. కానీ కాలికి దెబ్బ తగిలిందని కాలునే తీసేయలేం కదా...! ఇప్పటికీ మీడియాలో కొందరు నిజాయితీ పరులున్నారు. ఇక తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో కాస్త వ్యంగ్యాస్త్రాలు సంధించిన టివి9, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చానెల్స్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 

వాటి ప్రసారాలు, ప్రకటనలను ఆపివేసింది. ఇక ఏపీలోని టిడిపి సర్కార్‌ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు నుంచి పొలిటికల్‌ పంచ్‌ జర్నలిస్ట్‌ను.. ఎందరినో అణిచివేసింది. సోషల్‌ మీడియాపై కూడా తమ సత్తా చాటుతోంది. పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు 'మన దేశంలో చట్టాలు బలహీనులపై బలంగా.. బలవంతులపై బలహీనంగా వ్యవహరిస్తున్నాయి' అనే మాట వాస్తవం. తెలంగాణ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మెంటల్‌ డిగ్గిరాజా అలియాస్‌ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. 

ఐఎస్‌ ఉగ్రవాదులను తెలంగాణ పోలీసులే ప్రోత్సహిస్తూన్నారని, వారు ఐఎస్‌కి సంబంధించిన ఓ నకిలి వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి తెలంగాణ పోలీసులు ఈమద్య బాగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలుకీలక కుట్రలను చేదించి ముందుగా వారిని పట్టుకోవడంలో ఇతర రాష్ట్రాల పోలీసులకు సహాయం చేస్తున్నారు.ఇక డిగ్గీ రాజా భారతే కాశ్మీర్‌ను ఆక్రమించిందని వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ పోలీసులపై వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు డిగ్గీపై కేసులు పెడతామని హెచ్చరించారు. 

ఇక కాశ్మీర్‌ విషయంలో మోదీ సర్కార్‌ కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ కోరుకునే డిగ్గీ రాజాలు ఎక్కువైపోతున్నారు. డిగ్గీ అయితే కావాలంటే అరెస్ట్‌ చేయండి అంటున్నాడు. కానీ ఇటు పోలీసులపై వ్యాఖ్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం, కాశ్మీర్‌ అంశంపై మాట్లాడిన డిగ్గీని మోదీ ప్రభుత్వం సినిమా చూస్తున్నట్లు చూస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలి. ఉరితీయాలి. కానీ మన చట్టాలు, నాయకులు మీడియా మీద, రోహిత్‌ వేముల మీద చూపిన ప్రతాపం డిగ్గీపై చూపలేవనేది వాస్తవం. 

Digvijaya Singh Comments on the Telangana Police!:

Intolerance is growing in the country's rulers. Whoever speaks against us is also strangling. Their voice is not heard. The Telangana ministers had given a tough deal on TV9, Andhra Jyothi and ABN Channels, which had a handful of satire during the swearing-in ceremony. Mental Diggi raja alias Digvijaya Singh has made comments on the Telangana police's self-sufficiency.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ