'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం 6 రోజులలోనే 'పీకే' రికార్డును బద్దలు కొట్టి, ఇండియాలోని హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. త్వరలో 1000కోట్లు, ఆపైన 1500కోట్లు సాధించడం సులభమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక 'బాహుబలి1' కూడా 650కోట్ల దాకా వసూలు చేసిందని ప్రకటించారు. కానీ నిర్మాతలు మాత్రం తమకు ఈ చిత్రం ద్వారా లాభాలేమీ రాలేదంటున్నారు.
ఇక బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభపడ్డారే గానీ నిర్మాతలకు మిగిలింది ఏమీ లేదంటున్నారు. మరో పక్క పలు హాలీవుడ్ చిత్రాలలో కేవలం 10శాతం బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామంటున్నారు. 'రోబో,2.0' కంటే తక్కువ బడ్జెట్ అంటున్నారు. అంటే కనీసం ఓ 150 నుంచి 200కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని తీశారని భావించవచ్చు. ఇక పబ్లిసిటీ, ఫైనాన్స్ మీద వడ్డీ అన్ని కలుపుకున్నా కూడా 200కోట్లు అవుతుంది. మొదటి భాగం 650కోట్లు సాధించిందని చెబుతున్నారు. మరి నష్టాలు ఎందుకు వస్తాయి? ఇక చైనీస్, జర్మనీ వంటి భాషల్లో ఆడకపోవడం వల్ల నష్టాలుమిగిలియాయంటున్నారు.
మరి ఎంతైనా ఆయా భాషల వల్ల ఎంత నష్టం వచ్చి ఉంటుంది? ఇక సెకండ్‌పార్ట్ 1500కోట్లు వసూలు చేస్తే నిర్మాతలకు ఎంత మిగులుతుంది... అనే విషయాలు బహిరంగ రహస్యమే.కాకపోతే కష్టపడి, ధైర్యంగా తీశామనే సింపతీ, ఇటీవల సినిమా కలెక్షన్లను ప్రకటించిన పలు చిత్రాలపై ఐటి దాడుల నేపధ్యంలోనే నిర్మాతలు ఇలా చెబుతున్నారని భావించాల్సివస్తుంది.